Minister Dance: మరోసారి తన డ్యాన్స్‌తో మనసు దోచుకున్న మంత్రి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు. ఒంటరిగా ఉండటం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన అప్పట్నుంచి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు.
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు. ఒంటరిగా ఉండటం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన అప్పట్నుంచి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. ప్రస్తుతం సుంగ్రెమాంగ్ ఫెస్టివల్ సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో మరోసారి అక్కడి వారి హృదయాలను గెలుచుకున్నారు.నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న టెమ్‌జెన్ ఇమ్నా ఆ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. ఆయన భారీకాయాన్ని చూడగానే అక్కడి వారు ఇట్టే గుర్తుపట్టేస్తారు. తాజాగా సుంగ్రెమాంగ్ వేడుకలో పాల్గొని అక్కడి కళాకారులతో కలిసి డాన్స్‌చేశారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘నేను కూడా డాన్స్ చేయగలను’ అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ వేడుకలను ఉద్దేశించి.. సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటూ జరుపుకునే అవో నాగాల పండుగ ఇది. ఈ గొప్ప వారసత్వాన్ని సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని మంత్రి ఇమ్నా సూచించారు. నాగాలాండ్ సంస్కృతిని, ఇక్కడి నృత్యాలను అన్వేషించేందుకు సందర్శించండి అంటూ కూడా సదరు మంత్రివర్యులు ప్రజలను కోరారు. ఇక మంత్రి డాన్స్ వీడియో ఇటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దాదాపు లక్షమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తూ… నెటిజెన్లు ప్రశంసలతో ఇమ్నాను ఆకాశానికెత్తేస్తున్నారు.. ఒంటరిగా ఉంటూనే ఆనందలోకాల్లో విహరిస్తున్నారంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

