- Telugu News Photo Gallery Political photos 75th independence day pm narendra modi turban color changed every time in the last 8 years
PM Narendra Modi: గత 8 ఏళ్లుగా రంగు మారుతోన్న ప్రధాని మోడీ తలపాగా.. అందరి చూపు ఈ ఏడాదిపైనే..
2014 నుంచి 2021 వరకు ప్రధాని దుస్తులు, తలపాగా రెండూ చర్చలో ఉన్నాయి. నేడు (ఆగస్టు 15న) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75వ వార్షికోత్సవం సందర్భంగా..
Updated on: Aug 15, 2022 | 5:55 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఎర్రకోటపై వరుసగా తొమ్మిదోసారి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రతి సంవత్సరం ప్రధాని మోడీ తలపాగా రంగు మారుతూ కనిపించింది. ఇటువంటి పరిస్థితిలో దేశ ప్రజల కళ్ళు ఈ ఏడాది మోడీ తలపాగా, దుస్తులపై నిలిచాయి. 2014 నుంచి 2021 వరకు ప్రధాని దుస్తులు, తలపాగా రెండూ చర్చలో ఉన్నాయి. నేడు (ఆగస్టు 15న) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించుకుంటున్న ఈ వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి.

2014లో ప్రధాని మోదీ తొలిసారిగా ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. ప్రకాశవంతమైన రంగుల కుర్తా, చుడీదార్ పైజామా ధరించాడు.

2015లో ప్రధాని మోడీ క్రీమ్ కలర్ కుర్తా, దానిపై జాకెట్ వేసుకున్నాడు. ప్రధాని మోడీ తలపాగా నారింజ రంగులో ఉంది. కొన్ని చోట్ల తలపాగాపై ఆకుపచ్చ, ఎరుపు గీతలు కూడా ఉన్నాయి.

2016లో ప్రధాని మోదీ సాదా కుర్తా ధరించి ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన తలపాగా ఎరుపు, గులాబీ రంగులో ఆకట్టుకుంది.

2017లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట ప్రాకారంపై నుంచి నాలుగోసారి జెండాను ఎగురవేశారు. ఆయన తలపాగా ఇలా ఉంది..

2018లో..

2019లో ప్రధాని నరేంద్ర మోడీ ఆరోసారి జెండాను ఎగురవేశారు. ఈసారి ఆయన తెలుపు రంగు కుర్తా ధరించారు. తలపాగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మిశ్రమంలో కనిపించింది.

2020లో..

2021లో ఎర్రకోటపై ప్రధాని మోడీ 8వ సారి జెండాను ఎగురవేశారు. ఆయన తలపాగా విషయంలో పలు మార్పులు చేశారు.





























