Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో సమాధులను తవ్వుతున్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి!
ఉక్రెయిన్ - రష్యా యుద్ధపోరులో లక్షణ మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఐతే ఎడతెరిపిలేని యుద్ధ వాతావరణం మూలంగా మరణించిన వారి మృతదేహాలను..
Ukraine People Dig Up Hastily Buried Bodies, know whole story: ఉక్రెయిన్ – రష్యా యుద్ధపోరులో లక్షణ మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఐతే ఎడతెరిపిలేని యుద్ధ వాతావరణం మూలంగా మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయలేక సామూహిక సమాధులలో, శిధిలాల కింద వదిలి వేశారు. ఇప్పుడు ఆయా మృతదేహాలున్న సమాధాలులను తవ్వి వారిని సంప్రదాయ పద్ధతిలో ఖననం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. వివరాల్లోకెళ్తే.. రూబిజ్నే అనే ప్రాంతం తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ రీజియన్‌లో భాగంగా ఉంది. నాలుగు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏర్పాటు చేసిన ‘స్పెషల్ మిలిటరీ ఆపరేషన్’ ద్వారా జులైలో 50,000 మంది జనాభా నివసించే రూబిజ్నే టౌన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. యుద్ధ సమయంలో రూబిజ్నేలో ధ్వంసమైన ఓ అపార్ట్‌మెంట్ బ్లాక్ వెలుపల తవ్వకాలు చేపట్టగా అందులోనుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలోనే లిలియా (48) అనే స్థానికురాలు.. తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. దాడుల సమయంలో 10 రోజులపాటు తన అపార్ట్‌మెంట్‌కు చేరుకోలేకపోయానని, ఆ సమయంలో తన తల్లి మృతి చెందిందని ఆమె వాపోయారు. ‘మా అమ్మ అప్పటికే మరణానికి చేరువైంది. ఆమె చేతులు నీలి రంగులోకి మారాయి. ముఖం వాడిపోయింది. మరుసటి రోజే ఆమె మరణించింది. ఎడతెగని దాడుల వల్ల ఆమె అంత్యక్రియలు నిర్వహించలేకపోయాం, అందువల్ల బహిరంగ కందకంలోకి ఆమెను లాగి పూడ్చివేశం. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని వెలికి తీసి శ్మశానవాటికలో పూడ్చుతామని లిలియా కన్నీటి పర్యాంతమయ్యారు.
ఈ విధంగా తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా-మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లో మృతదేహాల వెలికితీత ప్రక్రియ చేపడుతోంది. ఎల్‌పిఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ.. ‘రూబిజ్నేలో ఒక బృందం10 రోజులపాటు తవ్వకాలు నిర్వహించి 104 మృతదేహాలను వెలికితీశారు. సిటీలో ఈ విధమైన బహిరంగ సమాధాలు మొత్తం 500ల వరకు ఉంటాయి. మృతుల్లో గాయాలతో మరణించినవారు మాత్రమేకాకుండా తుపాకుల తుటాలు తగిలి మరణించినవారు కూడా ఉన్నాయి. గుర్తు తెలియని మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో డీఎన్‌ఏ పరీక్ష చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.