Chicken: అక్కడ కిలో చికెన్ రూ.1200, ఒక కోడి గుడ్డు రూ.62.. భవిష్యత్తులో మరింత పెరగనున్న ధరలు.. ఎక్కడో తెలుసా..
ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంటుంది రూ.5 లేకపోతే రూ.6 ఉంటోంది. కిలో చికెన్ ఎంత.. మహా అయితే రూ.300 ఉంటుందిలే అనుకుంటాం.. కాని అక్కడ చికెన్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతాం. నిజమే కిలో చికెన్ ధర కనీసం రూ.1200, ఒక కోడిగుడ్డు..
Viral News: ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంటుంది రూ.5 లేకపోతే రూ.6 ఉంటోంది. కిలో చికెన్ ఎంత.. మహా అయితే రూ.300 ఉంటుందిలే అనుకుంటాం.. కాని అక్కడ చికెన్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతాం. నిజమే కిలో చికెన్ ధర కనీసం రూ.1200, ఒక కోడిగుడ్డు అయితే రూ.62 ఇదేక్కడో కాదు.. మనకు పక్కనే ఉన్న శ్రీలంకలో.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంకలో మిగులు డిమాండ్ కారణంగా చికెన్, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పశుగ్రాసం కొరతతో ఈధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ.62కు పెరిగిందని, ఒక కిలో ఫ్రోజెన్ చికెన్ ధర చికెన్ ధర దాదాపు రూ.1,200 రూపాయలకు పెరిగిందని, మార్కెట్‌లోనూ లైవ్ చికెన్ ధర దాదాపు రూ.1,300 కు చేరుకుందని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. పశుగ్రాసం కొరత కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ, వ్యవసాయ క్షేత్రాలు, ప్రధానంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల రంగంలో జంతువులను పెంచడం కష్టతరంగా మారిందన్నారు. శ్రీలంకలో 2021లో ఎరువుల నిషేధంతో వరి పంట సాగు దాదాపు 40 శాతం పడిపోయిందని, దీంతో దేశంలో ఆహార కొరత ఏర్పడటంతో పాటు ఇతర సంబంధిత పరిశ్రమలను ప్రభావితం చేసింది. శ్రీలంకలో పౌల్ట్రీ పరిశ్రమ కోసం దాదాపు 600,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న అవసరం కాగా.. ప్రస్తుతం 400,000 మెట్రిక్ టన్నులన మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని శ్రీలంక దిగుమతి చేసుకోవల్సి వస్తుంది.
ఎరువుల నిషేధం కారణంగా గత సంవత్సరంలో కేవలం 75,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మాత్రమే ఉత్పత్తి అయిందని.. ఈలోపు మొక్కజొన్న సరఫరాదారులు ధరలను పెంచే ప్రయత్నంలో మార్కెట్‌కు సరఫరాను తగ్గించారని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. మార్చి వరకు కిలో మొక్కజొన్న 70 రూపాయలు ఉండగా.. కొరత కారణంగా ప్రస్తుతం రూ.275 రూపాయలకు చేరుకుందని తెలిపారు. మార్కెట్ స్థిరంగా లేకపోవడం, జంతువుల పెంపకం ఖర్చులు పెరగడంతో చాలా మంది ఈరంగాన్ని వివిచిపెట్టారని.. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఉత్పత్తిని 50 శాతం తగ్గించినట్ల పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో చికెన్, కోడిగుడ్లను డిమాండ్ కు తగినట్లుగా అందించలేకపోవచ్చని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ తెలిపింది. శ్రీలంకలో వంటగ్యాస్, ఇంధన సమస్యలు ప్రస్తుతం కొంత నియంత్రణలో ఉన్నందున, రెస్టారెంట్, హోటల్ పరిశ్రమలు గత రెండు వారాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని.. దీంతో చికెన్, గుడ్లకు డిమాండ్ పెరిగిందని ఆల్ ఐలాండ్ పౌల్ట్రీ అసోసియేషన్ హెడ్ అజిత్ గుణశేఖర తెలిపారు. ఆగస్టు, రాబోయే రోజుల్లో శ్రీలంకకు పర్యాటకుల రాకపోకలు పెరుగుతాయనే అంచనా నేపథ్యంలో చికెన్, గుడ్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని.. పశుగ్రాసం సమస్యను పరిష్కించగలిగతితే డిమాండ్ కు అనుగుణంగా గుడ్లు, చికెన్ సరఫరాను పెంచగలమని అజిత్ గుణశేఖర వివరిచారు. కాకపోతే రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..