Amul Milk Prices: సామాన్యులకు షాకిచ్చిన అమూల్‌.. మరోసారి పెరిగిన పాల ధర

Amul Milk Prices: దేశంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారంగా మారుతోంది...

Amul Milk Prices: సామాన్యులకు షాకిచ్చిన అమూల్‌.. మరోసారి పెరిగిన పాల ధర
Amul Milk (File Photo)
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2022 | 4:03 PM

Amul Milk Prices: దేశంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారంగా మారుతోంది. తాజాగా అమూల్‌ పాల ధర కూడా పెరిగింది. దేశ వ్యాప్తంగా లీటర్‌ పాలపై రూ.2 చొప్పున పెంచుతున్నట్లు గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. దీంతో గుజరాత్‌ రాష్ట్రంతో పాటు ఢిల్లీ, బెంగాల్‌, ముంబై అన్ని రాష్ట్రాల్లో ఈ అమూల్‌ పాల ధర పెరగనుంది. ఇప్పుడు పెరిగిన ధరతో అమూల్‌ గోల్డ్‌ మిల్క్‌ ధర లీటర్‌కు రూ.31కి చేరింది. అదే అమూల్‌ టాటా రూ.25, అమూల్‌ శక్తి ధర రూ.28 చేరనుంది. పెరిగిన ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ అమూల బ్రాండ్‌ పేరుతో దేశ వ్యాప్తంగా పాల ఉత్పత్తి కొనసాగుతోంది. అమూల్‌ పాలు విక్రయించే అన్ని రాష్ట్రాల్లో ఈ ధరను పెంచుతున్నట్లు అమూల్‌ మిల్క్‌ తెలిపింది. పాల ఉత్పత్తిలో పెరిగిన వ్యయం కారణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతం పెరిగినట్లు, ఇన్‌పుట్‌ ఖర్చుల పెరుగుదలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాల ఉత్పత్తుల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను అమూల్‌ పాల ఉత్పత్తిదారులకు చెల్లిస్తుంది.

ఇవి కూడా చదవండి

గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ రోజుకు 150 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుండగా, అందులో గుజరాత్‌ 60 లక్షలు లీటర్లు, ఢిల్లీ 35 లక్షల లీటర్లు, మహారాష్ట్ర 20 లక్షల లీటర్లు విక్రయిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?