Maruti Suzki: మారుతీ సుజుకీపై రూ.2100 కోట్ల బకాయిలు.. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2160 కోట్ల నోటీసులు అందాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 3వ తేదీన మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి నోటీసు గురించి సమాచారం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది మారుతీ సుజుకీ. పెండింగ్‌లో ఉన్న రూ. 2,160 కోట్ల బకాయిల కోసం ఆదాయపు పన్ను శాఖ ..

ఆదాయపన్ను శాఖ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేసినట్లయితే ఆదాయపు పన్ను శాఖ సదరు కంపెనీగానీ, వ్యక్తికి గానీ నోటీసులు అందజేస్తుంటుంది. నోటీసులు అందుకున్న తర్వాత సదరు కంపెనీ, వ్యక్తి గానీ ఆదాయపు పన్ను శాఖకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంటుంది.
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2160 కోట్ల నోటీసులు అందాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 3వ తేదీన మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి నోటీసు గురించి సమాచారం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది మారుతీ సుజుకీ. పెండింగ్‌లో ఉన్న రూ. 2,160 కోట్ల బకాయిల కోసం ఆదాయపు పన్ను శాఖ నుండి డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్ ను అందుకున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ఇక విశేషమేమిటంటే ఈ విషయం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. ఇప్పుడు నోటీసులు అందుకుంది. అదే సమయంలో, వివాద పరిష్కార ప్యానెల్ ముందు తమ అభ్యంతరాలను నమోదు చేస్తామని ఆర్డర్‌కు ప్రతిస్పందనగా కంపెనీ తెలిపింది.
కంపెనీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్ ను అందుకుంది. ఇందులో రిటర్న్ ఆదాయానికి సంబంధించి రూ. 21,597 మిలియన్ల కొన్ని చేర్పులు/నిరాకరణలు ప్రతిపాదించబడ్డాయి.దీనికి సంబంధించిన సమాచారం జోడించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇవ్వబడింది. అయితే ఈ ఆర్డర్ కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదు.
డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్ జారీ
సాధారణంగా, ఒక సంస్థకు వ్యతిరేకంగా మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత పన్నుల విభాగం ద్వారా డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్ జారీ చేయబడుతుంది. ఇది మొత్తం ఆదాయం లేదా నష్టం, చెల్లించవలసిన లేదా తిరిగి చెల్లించవలసిన పన్ను, అసెస్సింగ్ అధికారి ద్వారా ప్రొసీడింగ్‌లను నిర్వహించిన కాలానికి సంబంధించిన ఇతర కీలక వివరాలను కలిగి ఉంటుంది.
క్షీణతతో రూ.10,340.90 వద్ద ముగిసింది
సెప్టెంబర్ 2023లో మారుతి సుజుకి ఇండియా అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసిన ఒక రోజు తర్వాత అక్టోబర్ 3న ఈ ఆర్డర్ జారీ చేయబడింది. గత నెలలో కంపెనీ మొత్తం హోల్‌సేల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 2.8 శాతం పెరిగి 181,343 యూనిట్లకు చేరుకున్నాయి. కాగా, గతేడాది ఇదే సమయంలో డీలర్‌లకు షిప్పింగ్ చేయబడిన యూనిట్ల సంఖ్య 176,306. అదే సమయంలో అక్టోబర్ 3 ట్రేడింగ్ సెషన్‌లో మారుతీ సుజుకి ఇండియా షేర్లు మునుపటి రోజు ముగింపుతో పోలిస్తే 2.46 శాతం క్షీణతతో బిఎస్‌ఇలో రూ.10,340.90 వద్ద ముగిసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




