PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 15వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?
రైతులు 15వ విడత 2023 గురించిన సమాచారాన్ని 30 నవంబర్ 2023లో లేదా అంతకు ముందు తనిఖీ చేయవచ్చు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బదిలీ చేస్తారు. ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైన తర్వాత కూడా మీకు బ్యాంక్ ఖాతాలో మొత్తం రాకుంటే మీరు పీఎం కిసాన్ ప్రాజెక్ట్ అధికారిక వెబ్‌సైట్ లో పీఎం..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి త్రైమాసికానికి రూ. 2000, ప్రతి సంవత్సరం రూ. 6,000/ కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు 15వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో నవంబర్ 30 లేదా అంతకంటే ముందు రైతులు 15వ విడత పొందవచ్చని భావిస్తున్నారు. 15వ విడత విడుదలైన తర్వాత మీరు pmkisan.gov.inలో మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
రైతులు 15వ విడత 2023 గురించిన సమాచారాన్ని 30 నవంబర్ 2023లో లేదా అంతకు ముందు తనిఖీ చేయవచ్చు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బదిలీ చేస్తారు. ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైన తర్వాత కూడా మీకు బ్యాంక్ ఖాతాలో మొత్తం రాకుంటే మీరు పీఎం కిసాన్ ప్రాజెక్ట్ అధికారిక వెబ్‌సైట్ @ pmkisan.gov.inలో పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా 2023ని తనిఖీ చేయడం ముఖ్యం. అదేవిధంగా లబ్దిదారులు pmkisan.gov.in వెబ్‌సైట్‌లో ఉన్న లింక్ ద్వారా కూడా15 వ విడతకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడింది. 15వ విడత తేదీని 30 నవంబర్ 2023న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 15వ విడత లబ్ధిదారులు https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లో స్థితిని తనిఖీ చేయవచ్చు . అయితే, అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in. ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
బ్యాంకు ఖాతాలో డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
కొందరికి పీఎం కిసాన్ డబ్బులు రాకుంటే అన్నింటిలో మొదటిది లబ్ధిదారుల జాబితాను చూడాలి. దీని కోసం pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇది మీ పేరు ఉందో లేదో చూపిస్తుంది. మీ పేరు జాబితాలో ఉన్నప్పటికీ మీరు వాయిదాను అందుకోనట్లయితే, చెల్లింపు స్థితిని తనిఖీ చేయడం వల్ల వివరాలు తెలుస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా చెల్లింపు స్థితిని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఖాతాలోకి ఇన్‌స్టాల్‌మెంట్ ఆలస్యం కావచ్చు. మీ వివరాలు సరిగ్గా లేని కారణంగా కూడా ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా మీరు కేవైసీ చేసి ఉండాలి. కేవైసీ పూర్తి చేయనట్లయితే కూడా డబ్బులు అందవని గుర్తించుకోండి. కేవైసీ లేకుంటే డబ్బులు రావు. వెంటనే మీ సేవ కేంద్రాల్లో కేవైసీ పూర్తి చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి