Mann Ki Baat: గత తొమ్మిదేళ్ల నుంచి మన్‌కీబాత్ కార్యక్రమం కీలకపాత్ర.. గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానం
పీఎం ముద్ర, స్వనిధి, సుకన్య సమృద్ది, జన్‌ధన్ ఖాతాలు, డైరెక్ట్ బెనిఫిట్స్ మినిస్టర్ స్కీములను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మన్‌కీబాత్ పోగ్రాం సక్సెస్ అయినట్టు ఎస్‌బీఐ రిపోర్ట్ వెల్లడించింది. మహిళా సాధికారికతపై మహిళలకు బాగా అవగాహన కల్పించారని తెలిపింది. మోదీ మన్ కీ బాత్ 105 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. అయితే సాధారణ ప్రజలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేడియో ప్రసంగాలు సమాజంపై ఎలా ప్రభావం చూపిందనే..
ఓటీటీలు , స్మార్ట్ టీవీల జమానాలో రేడియోపై ఇప్పటికి కూడా జనానికి ఆదరణ తగ్గలేదని ప్రధాని మోదీ మన్‌కీబాత్ కార్యక్రమం నిరూపిస్తోంది. గత తొమ్మిదేళ్ల నుంచి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో వస్తున్న మోదీ మన్‌కీబాత్ కార్యక్రమం పలు రంగాల్లో అభివృద్దికి దిక్సూచిగా నిలిచిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. 9 ఏళ్ల మన్‌కీబాత్ సంబంధించి ఎస్‌బీఐ ఎకనామిక్ డిపార్ట్‌మెంట్ ఈ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మన్‌కీబాత్ కార్యక్రమం కీలకపాత్ర పోషించినట్టు ఈ నివేదిక తెలిపింది.
పీఎం ముద్ర, స్వనిధి, సుకన్య సమృద్ది, జన్‌ధన్ ఖాతాలు, డైరెక్ట్ బెనిఫిట్స్ మినిస్టర్ స్కీములను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మన్‌కీబాత్ పోగ్రాం సక్సెస్ అయినట్టు ఎస్‌బీఐ రిపోర్ట్ వెల్లడించింది. మహిళా సాధికారికతపై మహిళలకు బాగా అవగాహన కల్పించారని తెలిపింది. మోదీ మన్ కీ బాత్ 105 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. అయితే సాధారణ ప్రజలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేడియో ప్రసంగాలు సమాజంపై ఎలా ప్రభావం చూపిందనే దానిపై ఎస్‌బీఐ, IIM-బెంగళూరు సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి.
మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఏదైనా అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా అది గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో ఉందని తమ అధ్యయనం వెల్లడించాయి. గూగుల్ సెర్చ్‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ సునామీ క్రియేట్ చేసందని వారు వెల్లడించారు. ఆ సమస్య గురించి, ఆ టాపిక్ గురించి ఆ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని అందరూ ఆత్రుతగా సెర్చ్ చేసేవారని పేర్కొన్నారు. కేవలం మోదీ ప్రస్తావనతోనే గూగుల్ సెర్చ్ ఇంజన్ లో అనూహ్యంగా ట్రాఫిక్ పెరిగిపోతుందని సెర్చ్ రిజల్ట్ అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకం 2015 జనవరిలో పీఎం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ప్రారంభించింది. మన్ కీ బాత్‌లో మోడీ కూతుళ్ల గురించి మాట్లాడినప్పుడు.. గూగుల్ సెర్చ్‌లో ఈ అంశంపై సెర్చ్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. ఇది వరుసగా 2 సంవత్సరాలు Google శోధనలో ప్రముఖ అంశంగా మిగిలిపోయింది. సుకన్య సమృద్ధి యోజన ఇది భారత ప్రభుత్వం చిన్న డిపాజిట్ పథకం, ఇది ముఖ్యంగా బాలికల కోసం. పీఎం దీని పేరును తీసుకున్నప్పుడు ఇది Googleలో అత్యధికంగా శోధించదగిన అంశంగా మారింది.
ఇప్పటివరకు 36 మిలియన్ సుకన్య సమృద్ది యోజన ఖాతాలను బ్యాంకుల్లో తెరిచారు. ఈ ఖాతా కింద 2 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ చేశారు. మన్‌కీబాత్ కార్యక్రమం 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమయ్యింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి