AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LED Headlights: మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..? జరిమానా బాదుడు తప్పదు మరి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తమ వాహనాలపై అనధికారిక ఆఫ్టర్‌మార్కెట్ వైట్ ఎల్ఈడీ లైట్లను ఉపయోగించే వాహన యజమానులు జరిమానాలను విధిస్తున్నారు. ముఖ్యంగా అలాంటి వాహనాలను గుర్తించేందుకు అహ్మదాబాద్ పోలీసులు ఇప్పటికే డ్రైవ్ ప్రారంభించారని, ఈ మేరకు రవాణా కమిషనరేట్ నుండి ఆదేశాలు కూడా ఇచ్చిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైట్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు  సాధారణంగా అనంతర మార్పులలో కనిపిస్తాయి.

LED  Headlights: మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..? జరిమానా బాదుడు తప్పదు మరి
Led Lights
Nikhil
|

Updated on: May 07, 2024 | 12:47 PM

Share

ఇటీవల కాలంలో వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. అయితే నలుగురిలో మన వాహనం ప్రత్యేకంగా కనిపించడానికి చాలా మంది వివిధ రకాల ఎల్ఈడీ లైట్లతో డెకరేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం చట్ట వ్యతిరేకమని చాలా మందికి తెలియదు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తమ వాహనాలపై అనధికారిక ఆఫ్టర్‌మార్కెట్ వైట్ ఎల్ఈడీ లైట్లను ఉపయోగించే వాహన యజమానులు జరిమానాలను విధిస్తున్నారు. ముఖ్యంగా అలాంటి వాహనాలను గుర్తించేందుకు అహ్మదాబాద్ పోలీసులు ఇప్పటికే డ్రైవ్ ప్రారంభించారని, ఈ మేరకు రవాణా కమిషనరేట్ నుండి ఆదేశాలు కూడా ఇచ్చిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైట్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు  సాధారణంగా అనంతర మార్పులలో కనిపిస్తాయి. తరచుగా పదునైన, నీలం-తెలుపు రంగును కలిగి ఉంటాయి. ఇది రహదారిపై అసౌకర్యం మరియు సంభావ్య భద్రతా ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ లైట్ల వల్ల కలిగే అసౌకర్యం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎల్ఈడీ లైట్లు ప్రకాశవంతంగా కనిపించినప్పటికీ ఈ హెడ్‌లైట్‌లు నిబంధనలకు అనుగుణంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించకుండా చేస్తాయి. ముఖ్యంగా అనధికారిక తెల్లటి ఎల్ఈడీ హెడ్ లైట్లు పరధ్యానానికి కారణమవుతున్నాయని అనేక ఫిర్యాదులు అందినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో గుజరాత్ ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంది. అలాంటి లైట్లను చట్టవిరుద్ధంగా అమర్చిన వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.అలాగే అనధికార తెల్లటి ఎల్ఈడీ లైట్లను విక్రయించే మరియు అమర్చిన ఆటో యాక్సెసరీ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటారు.

వీరిని గుర్తించేందుకు అహ్మదాబాద్ పోలీసులు ఎలాంటి కసరత్తు చేస్తున్నారో? ఇంకా తెలియరాలేదు. అయితే రోడ్లపై ఎల్ఈడీ హెడ్‌లైట్ పరధ్యానానికి సంబంధించిన ప్రమాదాలను అరికట్టడానికి ఇది మంచి ప్రయత్నమని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి