- Telugu News Photo Gallery Business photos Good news for those who want to buy new bikes, Launch of amazing bikes and scooters in the month of May, Bike Launches details in telugu
Bike Launches: కొత్త బైక్స్ కొనాలనుకనే వారికి గుడ్ న్యూస్… మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
ఇటీవల కాలంలో వ్యక్తిగత అవసరాలకు బైక్స్, స్కూటర్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థలో ఇబ్బందుల కారణంగా ప్రతి ఇంటికి బైక్ లేదా స్కూటర్ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మారుతున్న టెక్నాలజీకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బైక్స్, స్కూటర్స్‌లో ప్రత్యేక మార్పులతో లాంచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2024 చాలా బైక్‌లు, స్కూటర్లు లాంచ్ చేసినా మే 2024లో లాంచ్ చేసే బైక్స్ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో లాంచ్ అయ్యే బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: May 07, 2024 | 11:09 AM

బజాజ్ చేతక్‌కు సంబంధించిన కొత్త వేరియంట్ కూడా ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలో, బడ్జెట్ కొనుగోలుదారులకు అనుకూలమైన వేరియంట్‌గా నిలవనుంది. ఇటీవలే ఈ స్కూటర్ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే వారిక సంఖ్య పెరుగుతుంది.

హీరో జూమ్ 125, జూమ్ 160 స్కూటర్లను మీ ఈఐసీఎంఏ 2023లో ఆవిష్కరించింది. హీరో గ్జూమ్ 125 ఆర్, హీరో గ్జూమ్ 160 ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గ్జూమ్ 125 ఆర్ ఒక స్పోర్టీ 125 సీసీ కమ్యూటర్ స్కూటర్, అయితే హీరో గ్యూమ్ 160 అనేది మాక్సీ-స్టైల్ స్కూటర్. రెండింటినీ ఈ నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఒకాయ ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ కూడా ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫెర్రాటో అనే కొత్త బ్రాండ్‌తో వారి మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒకాయ ఫెర్రాటో డిస్‌రప్టర్ ఈ నెలలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీని కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

బజాజ్ మే 3 న బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400ను విడుదల చేసింది. ఈ బైక్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పల్సర్ వేరియంట్స్ కంటే అతి పెద్దది. ఈ నేపథ్యంలో ఈ బైక్ కోసం యువత అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బజాజ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ బైక్ గురించి అదనపు వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ నెలలోనే అత్యంత ఆసక్తికరమైన స్ట్రీట్ బైక్ హుస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 250ను లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ గురించి ఇటీవలే పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హుస్క్ వర్నా ఇటీవలే స్వర్ట్‌పిలెన్ 401, విట్‌పిలెన్ 250లను కూడా విడదుల చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే స్వర్ట్‌పిలెన్ 250 లాంచ్ అయ్యే అవకాశం ఉంది.




