AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!

భారత్‌ నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దాదాపు 11 నెలలుగా దేశంలో బియ్యం ఎగుమతులపై నిషేధం ఉంది. ఎన్నికల నేపథ్యంలో కొన్ని నిషేధాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. తాజాగా మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఆ దేశ ప్రజలకు ఎంతగానో మేలు జరగనుంది.

PM Modi: మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
Pm Modi
Subhash Goud
|

Updated on: May 07, 2024 | 9:15 AM

Share

భారత్‌ నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దాదాపు 11 నెలలుగా దేశంలో బియ్యం ఎగుమతులపై నిషేధం ఉంది. భారత్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలకు భారత్‌ నుంచి ఎగుమతి చేసే బియ్యంపై నిషేధం విధిస్తూ వస్తోంది. అయితే కొన్ని దేశాలకు మాత్రం నిషేధాలను ఎత్తివేస్తూ వస్తోంది కేంద్రం. ఈ కాలంలో సగానికిపైగా దేశాలు భారత్ నుంచి బియ్యం పంపేందుకు అనుమతించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మారిషస్ పేరు కూడా చేరింది. ఇప్పుడు మారిషస్ కూడా ఇండియన్ రైస్ తిననుంది. బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దేశీయ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం జూలై నుంచి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంతకు ముందు కూడా దాదాపు అరడజను దేశాలకు ప్రభుత్వం బియ్యం సరఫరా చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఎగుమతి చేసేందుకు ఎంత బియ్యాన్ని ఆమోదించిందో కూడా తెలుసుకుందాం.

14 వేల టన్నుల బియ్యం ఎగుమతి

మారిషస్‌కు 14,000 టన్నుల బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ (NCEL) ద్వారా మారిషస్‌కు 14,000 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతి లభించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్‌లో తెలిపింది. దేశీయ సరఫరాను పెంచడానికి, జూలై 20, 2023 నుండి బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. కానీ ప్రభుత్వం వారి ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి అభ్యర్థనపై కొన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి
Rice

Rice

ఈ దేశాలకు కూడా సరఫరా

ఇంతకుముందు టాంజానియా, జిబౌటీ, గినియా-బిస్సావుతో సహా కొన్ని ఆఫ్రికన్ దేశాలకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి భారతదేశం అనుమతించింది. ఇది కాకుండా నేపాల్, కామెరూన్, కోట్ డి ఐవరీ, గినియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సీషెల్స్ వంటి దేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి కూడా అనుమతి ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి