Bumper Offer: కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు

మిడ్-రేంజ్ ప్రీమియం కార్ల విక్రయంలో అగ్రగామిగా ఉన్న హోండా కార్స్, సిటీ సెడాన్, అమేజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎలివేట్ ఎస్‌యూవీ కార్లపై వివిధ ఆఫర్‌లను అందిస్తూ, తమ ఫ్లాగ్‌షిప్ కార్ల కొనుగోలుపై మే పీరియడ్ ఆఫర్‌ను అందిస్తోంది. కొత్త ఆఫర్లలో హోండా కంపెనీ సిటీ సెడాన్ కారు కొనుగోలుపై 1.15 లక్షల విలువైన ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు, మార్పిడి, కార్పొరేట్ తగ్గింపు..

Bumper Offer: కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు
Honda Cars
Follow us
Subhash Goud

|

Updated on: May 07, 2024 | 8:09 AM

మిడ్-రేంజ్ ప్రీమియం కార్ల విక్రయంలో అగ్రగామిగా ఉన్న హోండా కార్స్, సిటీ సెడాన్, అమేజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎలివేట్ ఎస్‌యూవీ కార్లపై వివిధ ఆఫర్‌లను అందిస్తూ, తమ ఫ్లాగ్‌షిప్ కార్ల కొనుగోలుపై మే పీరియడ్ ఆఫర్‌ను అందిస్తోంది. కొత్త ఆఫర్లలో హోండా కంపెనీ సిటీ సెడాన్ కారు కొనుగోలుపై 1.15 లక్షల విలువైన ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు, మార్పిడి, కార్పొరేట్ తగ్గింపు, జడ్‌ఎక్స్‌ వేరియంట్‌పై అధిక స్థాయి ఆఫర్‌ను పొందవచ్చు. సిటీ కారు పెట్రోల్ వెర్షన్ తో పాటు హోండా కంపెనీ వివిధ రకాల హైబ్రిడ్ మోడళ్లను కూడా అందిస్తోంది.

సిటీ హైబ్రిడ్ కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.65,000 అందించబడుతోంది. సెడాన్ వెర్షన్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది ఉత్తమ ఎంపిక. ఇది మార్కెట్లో 1.5 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికలతో ఉన్న సిటీ సెడాన్ కారు 121 హార్స్ పవర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్, సీటీవీ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది.

సిటీ సెడాన్ తర్వాత హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ మోడల్‌పై కూడా గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. అమేజ్ 2023 వెర్షన్‌పై రూ. 96,000 అయితే 2024 E, S, VX వేరియంట్‌లు రూ.56 వేల నుంచి రూ. 66 వేల వరకు ఆఫర్ చేస్తోంది. అమేజ్ మోడల్ ప్రస్తుతం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ మరియు CVT గేర్‌బాక్స్‌తో 90 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎలివేట్ కారుపై హోండా కూడా మంచి ఆఫర్ ఇస్తోంది. ఎలివేట్ కారును కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.55 వేలు అందించనున్నారు. ఎలివేట్ కారు వీ వేరియంట్‌లో రూ.55 వేల విలువైన ఆఫర్లు ZX వేరియంట్‌పై రూ. 25 వేల విలువైన ఆఫర్‌ను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి