Digital India: భారత ఆర్ధికాభివృద్ధిలో కొత్తశకం.. భారీగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు.. SBI కీలక నివేదిక

స్మార్ట్ ఫోన్ కారణంగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా భారీగా పెరిగినట్లు భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Digital India: భారత ఆర్ధికాభివృద్ధిలో కొత్తశకం.. భారీగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు.. SBI కీలక నివేదిక
Digital Payments
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2022 | 8:01 PM

భారత ఆర్ధికాభివృద్ధిలో కొత్తశకం ప్రారంభమైంది. డిజిటల్ యుగంలో.. నగదు ఆధారిత లావాదేవీలు డిజిటల్ వైపు మళ్లుతున్నాయి.. క్రమంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరుగుతోందని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యాయనాలు తెలిపాయి. అయితే.. స్మార్ట్ ఫోన్ కారణంగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా భారీగా పెరిగినట్లు భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్ లీడ్ పేమెంట్ అని వెల్లడింది. ఇది డిజిటల్ ఎకానమీకి దారితీసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. 20 ఏళ్లలో తొలిసారిగా దీపావళి వారంలో కరెన్సీ చెలామణి తగ్గుముఖం పట్టిందని నివేదిక పేర్కొంది. ఈ వారంలో ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ జరిగినట్లు వెల్లడింది.

డిజిటల్ ప్రయాణం విజయానికి ప్రధానంగా ప్రభుత్వ విధానాలే కారణమని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడం కలిసివచ్చిన అంశాలుగా తెలిపింది. ఇంకా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), వాలెట్‌లు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రమెంట్ (PPI) వంటి ఇంటర్‌ ఆపరబుల్ చెల్లింపుల వ్యవస్థలు చెల్లింపులను మరింత సులభతరం చేశాయని SBI తెలిపింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి కూడా డిజిటల్‌గా నగదు బదిలీ చేయడం సులభమైందని.. ఇంకా చౌకైనదిగా నిలిచిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత కాలంలో గ్లోబల్ డిజిటల్ ఎకానమీని భారత్ నడిపిస్తోంది. ఇది ఇప్పటికే 2022లో 72 బిలియన్ల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను పూర్తి చేసింది. 2021లో ఈ సంఖ్య 44 బిలియన్లకు చేరుకుంది. సగటున భారతదేశం కూడా రోజుకు 280 మిలియన్ల డిజిటల్ లావాదేవీలను నమోదు చేస్తోందని ఎస్బీఐ తెలిపింది.

భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. 2018లో మొత్తం సంఖ్య 14.59 బిలియన్లు కాగా, 2020లో కోవిడ్ పరిమితుల ద్వారా ఈ సంఖ్య 34 బిలియన్లుగా ఉంది.

ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి డిజిటల్ మార్కెట్లు, వ్యాపారాలు, డిజిటల్ ఆర్థిక సేవలను విస్తరించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న సేవల రంగం నుంచి అపారమైన సామర్థ్యాన్ని దక్షిణాసియా ఉపయోగించుకోవచ్చని దక్షిణాసియా ప్రాంతీయ ఇంటిగ్రేషన్ అండ్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ సెసిలీ ఫ్రూమాన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ చెల్లింపులు పెరగడం ద్వారా.. వృద్ధి మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..