Jio Bumper Offer: జియో నుంచి అదిరిపోయే ఆఫర్.. రూ. 395 రీచార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీ..
టెలికాలంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన రిలయన్స్ జియో.. తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తక్కువ రీచార్జ్‌తో ఎక్కువ సమయం వ్యాలిడిటీ కలిగిన..
టెలికాలంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన రిలయన్స్ జియో.. తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తక్కువ రీచార్జ్‌తో ఎక్కువ సమయం వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించిన జియోలో.. డేటా అవసరం లేకుండా వ్యాలిడిటీ కోరుకునే వారికోసం సరికొత్త ప్యాక్ అందిస్తోంది. 395 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే, ఇందులో కూడా కొంత డేటా వస్తుంది. అలాగే 1000 వరకు మెసేజ్‌లు ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను కూడా ఫ్రీగా ఇస్తోంది. 666 ప్లాన్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 395 జియో రీఛార్జ్ ప్లాన్..
రూ. 395 ప్రీపెయిడ్ ప్యాక్.. తక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారి కోసం ఉద్దేశించబడింది. ఈ ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అలాగే 6GB డేటా కూడా వస్తుంది. మొత్తం చెల్లుబాటు వ్యవధికి 1000 SMS లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు.. జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.
రూ. 666 జియో రీఛార్జ్ ప్లాన్..
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆసక్తికరమైన ప్రయోజనాలను అందిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో 126GB డేటాను పొందుతారు. అంటే, ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా వస్తుంది. ఈ ప్యాక్ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు కూడా వస్తాయి. ఈ ప్లాన్‌కి డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..