Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే

మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,900కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 51,160 పలుకుతోంది.

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2022 | 6:38 AM

బంగారం కొనుగోలు చేసేవారికి కాస్త ఊరట లభించింది. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు మంగళవారం (నవంబర్‌ 8)న కాస్త దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారంపై రూ.100 నుంచి రూ.120 వరకు తగ్గింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,900కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 51,160 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ100 మేర పెరిగింది. కొత్త ధరలతో బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 60,400 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద ఉంది.

☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 పలుకుతోంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 గా ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద ఉంది.

వెండి ధరలిలా..

ఇక మారిన ధరలతో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,400 గా ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,300 ఉంది. విజయవాడ, చెన్నై, బెంగళూరు, కేరళ లో కూడా ఇదే ధర పలుకుతోంది. ఇక ముంబై, కోల్‌తా నగరాల్లో రూ.60,400 వద్ద ఉంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..