Digilocker: పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పు.. ఇప్పుడు డిజిలాకర్‌తో ధృవీకరణ చేయవచ్చు.. ఎలాగంటే..
డిజిలాకర్ ఖాతాను తెరవడానికి వినియోగదారులు మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. ఈ నంబర్ ఇప్పటికే ఆధార్‌కు లింక్ చేయబడి ఉండాలి. డిజిలాకర్ ఖాతాకు లాగిన్ అయినప్పుడు వినియోగదారులు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌కోడ్ (OTP) వస్తుంది. దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు మీరు డిజిలాకర్‌లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే మీరు ఆధార్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది..

అంతర్జాతీయ ప్రయాణాల కోసం పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో పెద్ద మార్పు జరిగింది. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఇప్పుడు ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ డిజిలాకర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిలాకర్ ఉపయోగించి అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అయితే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ అయిన passportindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పత్రం కాపీని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు
దరఖాస్తులు తమ పత్రాలను అప్‌లోడ్ చేయడానికి డిజిలాకర్‌ను ఉపయోగిస్తే, దరఖాస్తు ప్రక్రియ సమయంలో వారు ఎటువంటి పత్రాల హార్డ్ కాపీలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. ఈ దశ ప్రాసెసింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు.
ఈ నిబంధన ఎందుకు తీసుకొచ్చారు
దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో డిజిలాకర్ ప్రవేశపెట్టబడింది. అదే సమయంలో భౌతిక పత్రాల ధృవీకరణ అవసరాన్ని తగ్గించడానికి వివిధ ప్రాంతాలలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు అమలు చేయబడ్డాయి.




డిజిలాకర్ అంటే ఏమిటి?
డిజీ లాకర్ అనేది భారతీయ ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ సర్వీస్ ద్వారా ప్రజలు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని సర్టిఫికెట్స్‌లను భద్రతంగా ఉంచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు వాటిని యాక్సెస్ చేయవచ్చు కూడా. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు సైతం డిజీ లాకర్‌లో పొందుపర్చుకోవచ్చు.
ఆధార్ నుంచి పాస్‌పోర్ట్ వరకు..
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ కోసం డిజిలాకర్ ద్వారా ఆధార్ పత్రాలను ఉపయోగించడానికి మంత్రిత్వ శాఖ ఇప్పుడు అనుమతించింది. డిజిలాకర్‌లో ఏ రకమైన సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ మరియు ఓటర్ ఐడి కార్డును సురక్షితంగా ఉంచవచ్చు.
డిజీలాకర్ ఎలా ఉపయోగించాలి?
డిజిలాకర్ ఖాతాను తెరవడానికి వినియోగదారులు మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. ఈ నంబర్ ఇప్పటికే ఆధార్‌కు లింక్ చేయబడి ఉండాలి. డిజిలాకర్ ఖాతాకు లాగిన్ అయినప్పుడు వినియోగదారులు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌కోడ్ (OTP) వస్తుంది. దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు మీరు డిజిలాకర్‌లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే మీరు ఆధార్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి