Wheat Price: సామాన్యులకు మరో శుభవార్త చెప్పిన మోడీ సర్కార్.. దీపావళి లోపు మరింత చౌకగా
2022-23లో సాగులో ఎక్కువ విస్తీర్ణం, మెరుగైన దిగుబడి కారణంగా గోధుమ ఉత్పత్తి 11 కోట్ల 27.4 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. బియ్యానికి సంబంధించి ప్రభుత్వ స్థాయిలో భూటాన్ నుంచి 80,000 టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని భారతదేశానికి ఇప్పటివరకు అభ్యర్థన వచ్చిందని కార్యదర్శి తెలిపారు. దేశీయంగా ధరలను అదుపు చేసేందుకు బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతి వైట్ రైస్ ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింతగా దిగి వస్తే సామాన్యులకు ఎంతగానో..
ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. పప్పు దినుసుల నుంచి కూరగాయల వరకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే టమాట ధర సైతం మరింతగా దూసుకుపోతోంది. ఇవే కాకుండా నిత్యావసరాలతోపాటు గోధుమ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ధరలను నియంత్రించేందుకు కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టింది. గోధులమ ధరలను చౌకగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గోధుమ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు, దిగుమతి సుంకం తగ్గింపుతో సహా అన్ని ఇతర ఆప్షన్‌లను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. బియ్యం విషయానికొస్తే భూటాన్ నుంచి ఇప్పటివరకు 80,000 టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని భారతదేశానికి ప్రభుత్వ స్థాయిలో వినతి పత్రం అందిందని ఆయన చెప్పారు.
గోధుమల ఎగుమతిపై నిషేధం
దేశీయ లభ్యత, రిటైల్ మార్కెట్లలో పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి గత సంవత్సరం ప్రభుత్వం గోధుమల ఎగుమతిని నిషేధించింది. గోధుమలు, పిండి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో గోధుమ నిల్వలను పిండి మిల్లులకు, ఇతర వ్యాపారులకు విక్రయిస్తోంది.
ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది
ఈ సందర్భంగా చోప్రా విలేకరులతో మాట్లాడుతూ.. గత వేలం నుంచి గోధుమ ధరలు పెరిగాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను పరిశీలిస్తోంది. తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద ప్రభుత్వం సెంట్రల్ పూల్ నుంచి 1.5 మిలియన్ టన్నుల గోధుమలను పిండి మిల్లులు, ప్రైవేట్ వ్యాపారులు, బల్క్ కొనుగోలుదారులు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులకు మార్చి 2024 నాటికి విక్రయించాలని నిర్ణయించిందని అన్నారు.
వేడి కారణంగా ఉత్పత్తి తగ్గింది
దేశంలోని గోధుమ ఉత్పత్తి మునుపటి సంవత్సరంలో 109.59 మిలియన్ టన్నుల నుంచి 2021-22 పంట సంవత్సరంలో (జూలై-జూన్) 107.74 మిలియన్ టన్నులకు తగ్గింది. ఫలితంగా ప్రభుత్వ కొనుగోళ్లు గతేడాది 43 మిలియన్ టన్నులు కాగా ఈ ఏడాది 19 మిలియన్ టన్నులకు తగ్గాయి.
గోధుమ ఉత్పత్తి పెరుగుతుంది:
2022-23లో సాగులో ఎక్కువ విస్తీర్ణం, మెరుగైన దిగుబడి కారణంగా గోధుమ ఉత్పత్తి 11 కోట్ల 27.4 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. బియ్యానికి సంబంధించి ప్రభుత్వ స్థాయిలో భూటాన్ నుంచి 80,000 టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని భారతదేశానికి ఇప్పటివరకు అభ్యర్థన వచ్చిందని కార్యదర్శి తెలిపారు. దేశీయంగా ధరలను అదుపు చేసేందుకు బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతి వైట్ రైస్ ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింతగా దిగి వస్తే సామాన్యులకు ఎంతగానో ఉపశమనం కలుగనుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి