Savings Account Deposit Limit: సేవింగ్స్ ఖాతాలపై నిఘా.. ఇకపై వారందరికీ ‘పన్ను’ పడుద్ది.. నోటిసులొస్తాయ్ జాగ్రత్త!
ఇప్పటి వరకూ మీరు ఈ పొదుపు ఖాతాలో జమ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా నుంచి ఎంత డబ్బు తీస్తున్నారు? ఎంత డబ్బు వేస్తున్నారు? అనేది లెక్క తీస్తే.. అది పన్ను పరిధిలోకి వచ్చేంత ఎక్కువ మొత్తంలో ఉంటే మీరు ఇకపై ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చివరి వరకూ చదవండి..
ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతా లేని వారంటూ ఎవరూ లేరు. ప్రధాన మంత్రి ధన జన్ ఖాతాలతో అయితే దాదాపు ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా ఉంటోంది. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, సాధారణ పౌరులు ఇలా అందరికీ ఏదో ఒక బ్యాంకులో పొదుపు ఖాతాలు కలిగి ఉన్నారు. ఒక్కొక్కరూ రెండు, మూడు బ్యాంకుల్లో కూడా ఖాతాలను కలిగి ఉంటారు. అందరూ ఆయా ఖాతాల్లో డబ్బులు వేస్తూ.. తీస్తూ ఉంటారు. ఖాతాల్లో ఉండే బ్యాలెన్స్ మొత్తంపై బ్యాంకులు కొంత వడ్డీని కూడా అందిస్తుంది. ఇప్పటి వరకూ మీరు ఈ పొదుపు ఖాతాలో జమ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా నుంచి ఎంత డబ్బు తీస్తున్నారు? ఎంత డబ్బు వేస్తున్నారు? అనేది లెక్క తీస్తే.. అది పన్ను పరిధిలోకి వచ్చేంత ఎక్కువ మొత్తంలో ఉంటే మీరు ఇకపై ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చివరి వరకూ చదవండి..
బ్లాక్ మనీని అరికట్టేందుకు..
నల్లధనాన్ని అరికట్టేందుకు బ్యాంకులు, కార్పొరేట్లు, పోస్టాఫీసులు, ఎన్‌బీఎఫ్‌సీలు పొదుపు ఖాతాలో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ లావాదేవీలు జరిగినప్పుడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ (ఎస్‌ఎఫ్‌టీ) స్టేట్‌మెంట్‌లను సమర్పించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని పన్ను నిపుణులు అంటున్నారు. ఇందులో నగదును డిపాజిట్ చేయడం లేదా ఉపసంహరించుకోవడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డ్ ఖర్చులు, విదేశీ కరెన్సీ కొనుగోలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు మొదలైనవి ఉంటాయి.
అలాంటి ఖాతాలపై నిఘా..
పన్ను చట్టాల ప్రకారం, బ్యాంకింగ్ కంపెనీలు ఒక సంవత్సరంలో పది లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన లేదా విత్‌డ్రా చేసిన ఖాతాల గురించి ప్రస్తుత సంవత్సరంలో పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి. పన్ను చెల్లింపుదారుల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో (కరెంట్ ఖాతాలు, టైమ్ డిపాజిట్లు కాకుండా) ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లకు ఈ పరిమితి పరిగణించబడుతుంది.
ఆదాయపు పన్ను నియమం 114ఈ..
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు, ఉపసంహరణలపై పన్ను అధికారులకు తెలియజేయడం అవసరం. కాబట్టి మీ సేవింగ్స్ ఖాతాలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ ఖాతాలో ఈ పరిమితి రూ. 50 లక్షలు, అంతకంటే ఎక్కువే ఉంటుంది. అయితే, లావాదేవీ కాకుండా, మీరు తెలుసుకోవలసిన కొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఖాతాల నుంచి వచ్చే ఆదాయం, ఖర్చులకు సంబంధించి ఆదాయపు పన్ను నిబంధన 114ఈ గురించి తెలుసుకోవాలి. తద్వారా ఆదాయపు పన్ను రాడార్ పరిధిలోకి రాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో తన పొదుపు ఖాతా నుండి డబ్బు ఉపసంహరించుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. ఎందుకంటే దాని కంటే ఎక్కువ లావాదేవీలు ఆదాయపు పన్ను సెక్షన్ 1962లోని రూల్ 114ఈకింద నివేదించబడ్డాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..