Business Idea: అవును.. ఈ చెట్టుకు నిజంగానే డబ్బులు కాస్తాయి. ఎలాగంటే..
జత్రోఫా అనే మొక్కను పెంచడం ద్వారా డబ్బును ఆర్జించే అవకాశం ఉంది, ఈ మొక్కలను పెంచుతున్న రైతులు ధీర్ఘకాలికంగా గణనీయమైన రాబడిని ఆర్జిస్తున్నారు. జత్రోఫా మొక్కను డీజిల్ ప్లాంట్‌గా కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టు విత్తనాల నుంచి బయో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ఏడాదంతా ఈ చెట్లను పెంచుకోవచ్చు. పెద్దగా కష్టపడకుండానే లక్షల్లో ఆర్జించచ్చు...
చెట్టుకు ఏమైనా డబ్బులు కాస్తున్నాయా.? అని అంటుండం వినే ఉంటాం. అయితే నిజంగా ఈ జట్టును పెంచితే మాత్రం నిజంగానే డబ్బులు సంపాదించుకోవచ్చు. చెట్టుతో డబ్బు సంపాదన ఎలా అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
జత్రోఫా అనే మొక్కను పెంచడం ద్వారా డబ్బును ఆర్జించే అవకాశం ఉంది, ఈ మొక్కలను పెంచుతున్న రైతులు ధీర్ఘకాలికంగా గణనీయమైన రాబడిని ఆర్జిస్తున్నారు. జత్రోఫా మొక్కను డీజిల్ ప్లాంట్‌గా కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టు విత్తనాల నుంచి బయో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ఏడాదంతా ఈ చెట్లను పెంచుకోవచ్చు. పెద్దగా కష్టపడకుండానే లక్షల్లో ఆర్జించచ్చు. డీజిల్ ప్లాంట్‌కు సంబంధించిన విత్తనాలు కూడా మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. ఈ మొక్కకు పెద్దగా నీరు కూడా అవసరం ఉండదు.
ఈ మొక్కలకు చెందిన విత్తనాల నుంచి 25 శాతం నుంచి 30 శాతం నూనెను తీయవచ్చు. వీటి ద్వారా బయో డిజీల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మొక్కలను పెంచడం ద్వారా ఎకరానికి ఏటా రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఆదాయం ఆర్జించవచ్చు. ప్రభుత్వాలు సైతం ఈ జత్రోఫా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం 2009లో నేషనల్ బయో డీజిల్ మిషన్‌ను ప్రారంభించింది.
జత్రోఫా సాగుకు అనువైన వాతావరణం రాజస్థాన్‌లో ఎక్కువగా ఉంది. ఉదయపూర్, కోట, సికార్, బన్స్వారా, చురు మరియు చిత్తోర్‌గఢ్ జిల్లాల వంటి ప్రాంతాల్లో ఈ మొక్కలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఇక జత్రోఫా మొక్కల నుంచి డీజిల్ తయారు చేసే ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇందుకోసం జత్రోఫా మొక్క విత్తనాలను పండ్ల నుంచి వేరు చేస్తారు. అనంతరం విత్తనాలను పూర్తిగా శుభ్రం చేసి, మిషన్‌లో వేస్తే నూనె వస్తుంది.
హెక్టార్ భూమిలో సగటున 8 నుంచి 10 క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. ప్రభుత్వమే ఈ విత్తనాలను కొనుగోలు చేస్తోంది. మార్కెట్‌లో క్వింటాల్ విత్తనాలకు రూ. 1800 నుంచి రూ. 2500 వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని పొందడంలో జత్రోఫా మొక్కల పెంపకం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..