Income Tax: పన్ను చెల్లింపుదారులకు కొత్త ఫీచర్.. ‘ఐటీఆర్ డిస్కార్డ్’ అంటే ఏమిటి? ప్రయోజనం ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఆదాయ పన్ను శాఖ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని పేరు డిస్కార్డ్ ఐటీఆర్. దీని సాయంతో పన్ను చెల్లింపుదారులు తమ అసలైన, ఆలస్యంగా లేదా సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ఐటీఆర్లు) దాఖలు చేయబడి, వెరిఫై కాకపోతే వాటిని విస్మరించవచ్చు. ఇది మీకు ఐటీఆర్ స్టేటస్ లో తెలుస్తుంది. ఈ డిస్కార్డ్ ఐటీఆర్ ఆప్షన్ ను ఎలా వినియోగించాలి. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం రండి..

Income Tax: పన్ను చెల్లింపుదారులకు కొత్త ఫీచర్.. ‘ఐటీఆర్ డిస్కార్డ్’ అంటే ఏమిటి? ప్రయోజనం ఏమిటి?
Income Tax
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 08, 2023 | 8:00 PM

పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఆదాయ పన్ను శాఖ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని పేరు డిస్కార్డ్ ఐటీఆర్. దీని సాయంతో పన్ను చెల్లింపుదారులు తమ అసలైన, ఆలస్యంగా లేదా సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ఐటీఆర్లు) దాఖలు చేయబడి, వెరిఫై కాకపోతే వాటిని విస్మరించవచ్చు. ఇది మీకు ఐటీఆర్ స్టేటస్ లో తెలుస్తుంది. ఐటీఆర్ స్టేటస్ లో మీ రిటర్న్స్ వెరిఫై కాకపోయినా.. లేదా పెండింగ్ ఉన్నా.. మీరు ఈ డిస్కార్డ్ ఆప్షన్ ను ఎన్ని సార్లైనా వినియోగించుకోవచ్చు. ఈ డిస్కార్డ్ ఐటీఆర్ ఆప్షన్ ను ఎలా వినియోగించాలి. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం రండి..

డిస్కార్డ్ రిటర్న్ అంటే ఏమిటి?

డిస్కార్డ్ ఐటీ రిటర్న్ అనేది పన్ను చెల్లింపుదారుతో శాశ్వతంగా తొలగించబడిన ఆదాయపు పన్ను రిటర్న్. రిటర్న్‌లో లోపాలు లేదా అసమానతలు ఉన్నట్లయితే లేదా పన్ను చెల్లింపుదారు మళ్లీ ప్రారంభించాలనుకుంటే ఇది చేయవచ్చు. రిటర్న్‌ను డిస్కార్డ్ అనేది రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయడం కంటే భిన్నంగా ఉంటుంది. ఇది గతంలో ఫైల్ చేసిన రిటర్న్‌లో లోపాలను సరిదిద్దడానికి ఒక మార్గం. మీరు రిటర్న్‌ను డిస్కార్డ్ చేసినప్పుడు అది ఎప్పుడూ ఫైల్ చేయనట్లే పరిగణించబడుతుంది. మీరు రిటర్న్‌ను డిస్కార్డ్ చేసిన తర్వాత, అదే అసెస్‌మెంట్ సంవత్సరానికి మీరు కొత్త రిటర్న్‌ను ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి..

మీరు ‘డిస్కార్డ్ ఆప్షన్ ను ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్లో చూడవచ్చు. దాని కోసం మీరు ఈ కింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి..

ఇవి కూడా చదవండి

www.incometax.gov.in లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఈ-ఫై ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆపై ఆదాయపు పన్ను రిటర్న్ ను ఎంచుకొని, ఈ-వెరిఫై ఐటీఆర్ పై క్లిక్ చేసి వచ్చిన ఆప్షన్లలో డిస్కార్డ్ ఐటీఆర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్నిసార్లైనా చేయొచ్చా..

మీ ఐటీఆర్ స్టేటస్ ‘వెరిఫై కాకపోయినా/’ వెరిఫికేషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఆప్షన్ ను పొందగలుగుతారు. అయితే దీనిని మీరు ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి పరిమితి లేదు. అయితే, ముందస్తు షరతు ఏమిటంటే ఐటీఆర్ స్టేటస్ మాత్రం నాన్ వెరిఫై లేదా వెరిఫికేషన్ పెండింగ్ లో మాత్రమే ఉండాలి.

ఇంతకు ముందు రిటర్న్ డేటాను అప్‌లోడ్ చేసిన వ్యక్తి, వెరిఫై చేయని రిటర్న్‌ను డిస్కార్డ్ చేసే సదుపాయాన్ని ఉపయోగించుకున్నవారు తప్పనిసరిగా కొత్తది తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే ఐటీఆర్ ఫైల్ చేయని జాబితాలోకి ఆ వ్యక్తి వెళ్లిపోతారు.

అయితే ఈ ఆప్షన్ 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే అందుబాటులో ఉంది. అంతకు ముందు వారికి ఇది లేదు. మార్పులు చేర్పులకు ఐటీ శాఖ కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ఆ తుది గడువులోపు మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్ ను డిస్కార్డ్ చేస్తే దానిని మీరు తిరిగి వెనక్కి తీసుకోలేరు. అందుకే ఈ ఆప్షన్‌ను వినియోగించుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సూచించింది. ఐటీఆర్ డిస్కార్డ్ కొడితే.. మీరు ఐటీఆర్ అస్సలు ఫైల్ చేయలేదని అర్థం. తిరిగి కొత్త ఐటీఆర్ ఫైల్ చేసే వరకూ ఫైల్ కాలేదనే లెక్క ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు