Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆర్బీఐ రెపో రేటును యథాతథం.. గృహ రుణ ఈఎంఐలపై ఉపశమనం

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ ఏడాది ఐదోసారి కీలక పాలసీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేటుకు చివరి సవరణ ఫిబ్రవరిలో జరిగింది. ఇది 25 బేసిస్ పాయింట్ల పెంపు తర్వాత 6.5 శాతానికి పెరిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం గ్లోబల్ స్పైక్ తర్వాత మే 2022లో రెపో రేటు పెంపుదల ప్రారంభించింది..

RBI: ఆర్బీఐ రెపో రేటును యథాతథం.. గృహ రుణ ఈఎంఐలపై ఉపశమనం
Rbi Mpc
Follow us
Subhash Goud

|

Updated on: Dec 08, 2023 | 7:32 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాలసీ రెపో రేటును యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం గృహ రుణ గ్రహీతలకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. ఆర్‌బిఐ యథాతథ స్థితిని కొనసాగిస్తున్నందున, ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలు (ఇఎంఐలు) పెరిగే అవకాశం లేదు. దీంతో నెలవారీ ఈఎంఐలు చెల్లించేవారికి ఉపశమనం కలిగింది.

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ ఏడాది ఐదోసారి కీలక పాలసీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేటుకు చివరి సవరణ ఫిబ్రవరిలో జరిగింది. ఇది 25 బేసిస్ పాయింట్ల పెంపు తర్వాత 6.5 శాతానికి పెరిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం గ్లోబల్ స్పైక్ తర్వాత మే 2022లో రెపో రేటు పెంపుదల ప్రారంభించింది. ద్రవ్యోల్బణం సడలింపు సంకేతాలను చూపుతున్నప్పటికీ, రెపో రేటును యథాతథంగా ఉంచడానికి ఆర్బీఐ కీలక ప్రకటన వచ్చింది.

బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు, బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు. MPC నిర్ణయాలను ప్రకటిస్తూ, RBI రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అలాగే, SDF రేటు 6.25 శాతం, MSF రేటు 6.75 శాతం వద్ద కొనసాగవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఈనిర్ణయం తర్వాత, రుణ EMI లేదా FD పై వడ్డీ రేటు పెరిగే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి