BMX iX Electric SUV: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 1000కిలోమీటర్లు.. బీఎండబ్ల్యూ సరికొత్త బ్యాటరీ.. చిన్న పరిమాణం.. అధిక సామర్థ్యం..

వాటిల్లో బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఒకటి. ఇది మన దేశంలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 372కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిని అమాంతం పెంచేందుకు బీఎండబ్ల్యూ ప్రయత్నిస్తోంది. అందుకోసం మిచిగాన్ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ కంపెనీ అవుట్ నెక్ట్స్ ఎనర్జీ(ఓఎన్ఈ) కంపెనీతో కలిసి పనిచేస్తోంది. కాగా ఇప్పుడు బీఎండబ్ల్యూ ఓ ఆసక్తి కరమైన ప్రకటన వెలువరించింది. అదేంటంటే కొత్తగా అభివృద్ధి చేసిన బ్యాటరీతో ఇదే కారు ఇప్పుడు దాదాపు 1000 కిలోమీటర్ల రేంజ్ సింగిల్ చార్జ్ పై ఇస్తోందని ప్రకటించింది.

BMX iX Electric SUV: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 1000కిలోమీటర్లు.. బీఎండబ్ల్యూ సరికొత్త బ్యాటరీ.. చిన్న పరిమాణం.. అధిక సామర్థ్యం..
Bmw Ix Electric Car
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 08, 2023 | 8:50 PM

బీఎండబ్ల్యూ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న లగ్జరీ కార్ల బ్రాండ్. ప్రస్తుతం ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిపై ఫోకస్ చేస్తోంది. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపడుతోంది. ఇప్పటికే బహుళ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను గ్లోబల్ మార్కెట్ తో పాటు మన దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వాటిల్లో బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఒకటి. ఇది మన దేశంలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 372కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిని అమాంతం పెంచేందుకు బీఎండబ్ల్యూ ప్రయత్నిస్తోంది. అందుకోసం మిచిగాన్ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ కంపెనీ అవుట్ నెక్ట్స్ ఎనర్జీ(ఓఎన్ఈ) కంపెనీతో కలిసి పనిచేస్తోంది. కాగా ఇప్పుడు బీఎండబ్ల్యూ ఓ ఆసక్తి కరమైన ప్రకటన వెలువరించింది. అదేంటంటే కొత్తగా అభివృద్ధి చేసిన బ్యాటరీతో ఇదే కారు ఇప్పుడు దాదాపు 1000 కిలోమీటర్ల రేంజ్ సింగిల్ చార్జ్ పై ఇస్తోందని ప్రకటించింది. ఇది ఈవీ మార్కెట్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మూడు రెట్లు ఎక్కువ రేంజ్..

ప్రస్తుతం బీఎండబ్ల్యూ ఐఎక్స్ రేంజ్ సింగిల్ చార్జ్ పై 372కిలోమీటర్లు ఉంది. దీనిని మూడింతలు పెంచే లక్ష్యంతో చేపట్టిన పరిశోధనలు విజయవంతం అవుతున్నట్లు ఓఎన్ఈ సంస్థ ప్రకటించింది. దాదాపు ఇదే కారు తామ అభివృద్ధి చేసిన జెమినీ డ్యూయల్ కెమిస్ట్రీ బ్యాటరీతో సింగిల్ చార్జ్ పై ఏకంగా 1000 కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇస్తుందని ప్రకటించుకుంది.

కొత్త బ్యాటరీ ఇది..

ఈ కారులో ప్రయోగాత్మకంగా పెట్టిన బ్యాటరీ స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే.. ఇది జెమినీ బ్యాటరీ టెక్నాలజీతో తయారైంది. దీని రేటింగ్ 450WH/I ఆఫ్ వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ గా ఉంటుంది. ఇది 185కేడబ్ల్యూ కన్నా అధిక పవర్ ను స్టోర్ చేస్తుంది. అయితే బ్యాటరీ సైజ్ లో ఎటువంటి మార్పు ఉండదని ఓఎన్ఈ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అదే బ్యాటరీ పరిమాణంలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని తీసుకొస్తున్నట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి

బీఎండబ్ల్యూ నుంచి కొత్త కార్లు..

ఈ క్రమంలో బీఎండబ్ల్యూ తన ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియో ను మరింత పెంచుకునే ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా బీఎండబ్ల్యూ ఐఎం3 నోమెన్ క్లేచర్ కు ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసింది. దీంతో ఎం డివిజన్ లో అధిక పనితీరు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను మరిన్ని తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఆ జాబితాలో ఆల్ ఎలక్ట్రిక్ ఎం3 కూడా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..