Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధం: హర్‌దీప్‌సింగ్‌ పూరీ

పెట్రోలు, డీజిల్‌లను వస్తు సేవల పన్ను ( జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం , సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు..

Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధం: హర్‌దీప్‌సింగ్‌ పూరీ
Hardeep Singh Puri
Follow us
Subhash Goud

|

Updated on: Nov 15, 2022 | 9:31 AM

పెట్రోలు, డీజిల్‌లను వస్తు సేవల పన్ను ( జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం , సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు. ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. రాష్ట్రాలు అంగీకరిస్తే మేం సిద్ధంగా ఉన్నాం. జీఎస్టీ పరిధిలోకి ఎలా తీసుకురావాలో కూడా ఆలోచించాలి. దీనిపై ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

శ్రీనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే ఇంధనం, మద్యం అమ్మకాలు వారి ప్రధాన ఆదాయ వనరులు. ఎవరైనా తమ ఆదాయ వనరులను వదులుకుంటారా? ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు.

ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై చర్చించాలని జీఎస్టీ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత గత నెలలో లక్నోలో సమావేశం జరిగింది. అయితే రాష్ట్రాలు అంగీకరించలేదు.

ఇవి కూడా చదవండి

ఇంధన ధరల్లో మరికొంత తగ్గింపును మనం ఆశించవచ్చా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, గత ఏడాదిలో భారత్‌లో కనిష్ట ఇంధన ధరల పెరుగుదల కనిపించిందని అన్నారు. మీ ప్రశ్నకి ఆశ్చర్యం వేసింది. ఉత్తర అమెరికాలో గత ఏడాది కాలంలో ఇంధన ధరలు 43 శాతం పెరిగాయి. కానీ భారత్‌లో ఈ పెరుగుదల కేవలం 2 శాతం మాత్రమేనని మంత్రి తెలిపారు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!