Air Coolers: చౌకైన కూలర్లు.. ఏసీలాంటి చల్లదనం.. ఎండ వేడిలో హిమపాతంలా.!
తెలుగు రాష్ట్రాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఇంకా ఎండలు మండిపోతున్నాయ్. మాడు పగిలే ఎండను తప్పించుకునేందుకు..

తెలుగు రాష్ట్రాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఇంకా ఎండలు మండిపోతున్నాయ్. మాడు పగిలే ఎండను తప్పించుకునేందుకు.. ఇంట్లో ఓ ఏసీ ఉంటే చాలు.. చల్లదనం మన చెంతకు వస్తుంది. అయితే ఏసీ ధరలు భారీగా ఉండటమే కాదు.. వాడితే కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. సామాన్యులకు ఇది కష్టంతో కూడుకున్న పని. అందుకే చాలామంది ఎయిర్ కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి ఏసీల మాదిరిగా అద్భుతమైన చల్లటి గాలిని అందిస్తాయ్. మరి అవేంటో తెలుసుకుందామా..!
-
బజాజ్ ఫ్రిఓ న్యూ పర్సనల్ ఎయిర్ కూలర్: ఈ బజాజ్ ఎయిర్ కూలర్ ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్‌లో రూ. 4,299కి అందుబాటులో ఉంది. 23 లీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉన్న ఈ ఎయిర్ కూలర్.. 30 అడుగుల వరకు చల్లటి గాలిని అందిస్తుంది.
-
క్రోమా ఏజెడ్ 40 పర్సనల్ ఎయిర్ కూలర్: ఈ ఎయిర్ కూలర్ క్రోమా సైట్‌లో రూ. 4,990కి లభిస్తోంది. 40 లీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడిన ఈ కూలర్ హనీకోంబ్ ప్యాడ్‌తో చల్లటి గాలిని అందిస్తుంది.
-
ఏటి 40 లీటర్ల ఎయిర్ కూలర్: ఈ ఎయిర్ కూలర్ రూ. 4,999కి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. ఇందులో 40 లీటర్ల వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉంది. ఇది సుమారు 100 అడుగుల దూరం వరకు చల్లగాలిని అందిస్తుంది.