Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: ఈ బడ్జెట్‌లో రైళ్లు వేగంగా పరుగెత్తనున్నాయా? AIపై మరింత దృష్టి!

Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్‌ను సమర్పించడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మోదీ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్‌. బడ్జెట్‌లో రైల్వేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది..

Budget 2025: ఈ బడ్జెట్‌లో రైళ్లు వేగంగా పరుగెత్తనున్నాయా? AIపై మరింత దృష్టి!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 31, 2025 | 8:20 AM

బడ్జెట్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతరామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏ రంగాలకు ఎలాంటి బడ్జెట్‌ ఉండనుందో అందరు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రైల్వే బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. రైల్వేపై ఎలాంటి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారనేదానిపై చర్చ జరుగుతుంది. రైల్వేలకు మూలధన పెట్టుబడి దాదాపు 40 శాతం వరకు బడ్జెట్‌ కేటాయింపుల నుంచే వస్తోంది. ఈ బడ్జెట్‌లో కూడా రైల్వేలకు బడ్జెట్‌ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో మూలధన పెట్టుబడి 77శాతం పెరిగింది. 2020-25 మధ్య రూ.13.6 లక్షల కోట్లను జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) ద్వారా కేటాయించినా రూ.9.59 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Taxpayers: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ గడువు పెంచవచ్చు!

దేశీయంగానే రైళ్ల తయారీ:

ఇవి కూడా చదవండి

ఈ 2025 బడ్జెట్‌లో రైళ్ల స్పీడ్‌ ప్రణాళికను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ బడ్జెట్‌లో కొత్త మార్గాలు, రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ, ఇతర ప్రాజెక్టులు, సదుపాయాలపై బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. రైళ్లను దేశీయంగానే తయారు చేయాలనే దానిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందు కోస రైల్వేకు మరిన్ని నిధులు పెంచాలని భావిస్తోంది. 2026 నాటికి ఈ ప్రాజెక్టుల కోసం రూ.3 లక్షల కోట్లు కావాలని అంచనా. రైళ్లను సొంతంగానే తయారు చేసుకోవాలనే దానిపై ప్రత్యేక నిధులను కేటాయిస్తే దేశీయ తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుంది.

కవచ్‌ వ్యవస్థ:

ఇక కవచ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ప్రణాళికలు రచించనుంది. రైళ్లు ఢీకొనకుండా ఈ కవచ్‌ టెక్నాలజీని తీసుకువచ్చింది కేంద్రం. దక్షిణ మధ్య రైల్వేలో 1,465 కిలోమీటర్ల పొడవునా 144 రైలు ఇంజిన్లకు ఈ కవచ్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీనిని 6,000 కిలోమీటర్లకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే రైల్వే అభివృద్ధిలో భాగంగా కొన్ని రైల్వే వంతెనలు, బైపాస్‌లు, సరకు రవాణా టెర్మినళ్లు, ప్రయాణికుల హబ్‌లను నిర్మించాల్సి ఉండగా, వాటిపై కూడా కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే టెక్నాలజీని వినియోగించుకుని సీట్ల లభ్యత, త్వరగా టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయ్యేలా చర్యలపై కూడా ప్రకటించవచ్చు. అలాగే రైల్వే ట్రాక్‌ అభివృద్ది, రైళ్లను మానిటర్‌ చేయడం వంటి వాటిపై కేంద్రం దృష్టి సారించనుంది. ఆధునిక బోగీలు, ఇంజిన్ల తయారీపై దృష్టి సారించడంతోపాటు వచ్చే రెండు దశాబ్దాల్లో లక్ష కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కృత్రిమ మేధస్సు (AI)ని అమలు చేయడంపై కూడా దృష్టి సారిస్తోంది.

బడ్జెట్‌లో వందే భారత్‌పై ఫోకస్‌:

ప్రస్తుతం కేంద్ర ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతం కావడంతో మరిన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీంతో ఈ బడ్జెట్‌లో మరిన్ని ప్రణాళికలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికల నాటికి బుల్లెట్‌ రైలును పట్టాలు ఎక్కించాలనే దానిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వందే భారత్‌ రైళ్ల వేగం పెంచేందుకు వీలుగా పట్టాల గేజ్‌ మార్పిడి, డబుల్, త్రిపుల్, క్వాడ్రాపుల్‌ లైన్ల నిర్మాణం అవసరమని నిపుణులు చెబుతుండగా, దీనిపై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఈ యూనియన్ బడ్జెట్ 2025లో భారతీయ రైల్వేలకు మూలధన వ్యయంలో 17-20 శాతం పెంపును కేటాయించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ పెరుగుదల మొత్తం కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.65 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 3 లక్షల కోట్లకు పైగా పెంచవచ్చు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే రూ. 1,92,446 కోట్లు (దాని రూ. 2.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో 76 శాతం) ఖర్చు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, 2024-25 బడ్జెట్ అంచనాలో రైల్వేల మొత్తం క్యాపెక్స్ రూ. 2,65,200 కోట్లు, స్థూల బడ్జెట్ మద్దతు రూ. 2,52,200 కోట్లు. అందులో ఇప్పటికే రూ.1,92,446 కోట్లు ఖర్చు చేశారు.

ఇది కూడా చదవండి: Budget 2025: ఉపాధిపై ఆశలు.. పన్ను తగ్గింపులు.. లైవ్ బడ్జెట్‌ను ఎక్కడ చూడాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి