Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. అయితే.. గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. కొత్త ఏడాది ప్రారంభం నుంచి..

Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 31, 2025 | 6:18 AM

దేశంలో బంగారంలో పెరుగుదల కనిపించింది. బడ్జెట్‌ ప్రవేశానికి రెండు, మూడు రోజుల నుంచే పెరుగుతూనే ఉంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం తగ్గించిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర భారీగా పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. బంగారం మార్కెట్ పెరుగుతూనే ఉంది. తాజాగా జనవరి 30వ తేదీన బంగారంపై స్వల్పంగానే పెరిగినా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.83,180 స్థాయికి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్ల బలం కారణంగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,030 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,030 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,180 ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,030 ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,030 ఉంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,030 ఉంది.
  7. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,030 ఉంది.

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దీని ధర కూడా భారీగానే పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 96 వేలు ఉన్న వెండి ధర శుక్రవారం ఏకంగా రూ.98,600 వరకు వెళ్లింది. కొన్ని రాష్ట్రాల్లో రూ. లక్షా 6 వేల వరకు ఉంది. అయితే చెన్నై, హైదరాబాద్‌, కేరళలో కిలో వెండి ధర రూ.1 లక్ష 6 వేల వరకు ఉంది. మిగితా రాష్ట్రాల్లో రూ.98,600 వద్ద కొనసాగుతోంది.

ఎల్‌కెపి సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది ప్రకారం, “ఎంసిఎక్స్‌లో బంగారం బుల్లిష్‌గా ట్రేడవుతోంది. ఎందుకంటే పెట్టుబడిదారులు దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల విధానాల దృష్ట్యా, పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడిని పెంచవచ్చు. అదనంగా, US డాలర్ బలహీనత, బాండ్ ఈల్డ్‌లలో తగ్గుదల కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ. 85,000 స్థాయిని తాకవచ్చు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. మార్కెట్ సంకేతాలపై శ్రద్ధ వహించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి