Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం మిస్ అయ్యారా.? రూ. 12 లక్షలకు నో టాక్స్‌తో పాటు హైలైట్స్ ఇవే..

Budget 2025-26 Highlights: బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను ప్రస్తావించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ స్టోరీలో చూద్దాం..

Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం మిస్ అయ్యారా.? రూ. 12 లక్షలకు నో టాక్స్‌తో పాటు హైలైట్స్ ఇవే..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2025 | 1:16 PM

దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన కార్యక్రమంలో తీసుకొస్తున్నట్టు నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కోటి 70లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు నిర్మలాసీతారామన్‌. దేశంలోని 10 విస్తృత రంగాలపై కేంద్రం దృష్టి సారిస్తుందన్నారు నిర్మలాసీతారామన్‌. వీటి ద్వారా వ్యవసాయ వృద్ధితోపాటు ఉత్పదకత పెరుగుతుందని తెలిపారు.

బడ్జెట్ టాప్ 9 హైలైట్స్ ఇవే..

  1. లోక్‌సభలో బడ్జెట్‌ను ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు సహా ఆరురంగాల్లో సమూల మార్పులు చేశారు.
  2. ప్రధాని ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రకటించారు నిర్మల. ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో కొత్త పథకం అమలు చేస్తామన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతోపాటు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితిని మూడు నుంచి 5 లక్షలకు పెంచారు.
  3. ఈ బడ్జెట్‌లో పోస్టల్‌ రంగానికి ఊపిరిలూదారు నిర్మల. MSMEలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. పీఎం ధన్‌ధాన్య యోజనతో కోటి 70 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దేశంలోని వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించారు.
  4. గోడౌన్లు, నీటిపారుదల, రుణాల కల్పన, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పథకం ప్రకటించారు నిర్మల. కంది, మినుములు, మైసూర్‌ పప్పు కొనుగోలుకు నిర్ణయించారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తెస్తున్నారు. స్టార్టప్‌ల కోసం 20 కోట్ల వరకు, MSMEలకు 10 కోట్ల వరకు రుణాలిచ్చేందుకు నిర్ణయించారు.
  5. ఇవి కూడా చదవండి
  6. తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్‌లో చేయూతనిచ్చారు నిర్మల. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థను ప్రారంభిస్తామన్నారు. మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు.
  7. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించారు నిర్మల. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా లక్షలన్న రోట్లు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌, అంతర్రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక ప్రకటించారు.
  8. వికసిత్‌ భారత్‌ కోసం న్యూక్లియర్‌ ఎనర్జీ మిషన్‌తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్‌ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు, IIT, IIScలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
  9. బడ్జెట్‌లో వేతనజీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. 12 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్‌ మినహాయించింది. 12 నుంచి 16 లక్షల వరకు 15 శాతం, 16 నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20శాతం, 20 నుంచి రూ.24 లక్షల వరకు 25శాతం పన్ను విధిస్తారు. వచ్చే వారం కొత్త ఇన్‌కం ట్యాక్స్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
  10. బీమారంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకు అవకాశం కల్పించారు. కస్టమ్స్‌ చట్టంలో 7 రకాల సుంకాలను తొలగించారు. క్యాన్సర్‌ ఔషధాలు, సర్జికల్‌ పరికరాలపై సుంకాలు తగ్గించారు. లిథియం బ్యాటరీలపై పన్ను తొలగింపుతో Led టీవీలు, మొబైల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి