BSNL రీఛార్జ్ ప్లాన్‌లు.. సంవత్సరం కంటే ఎక్కువ వ్యాలిడిటీ.. అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్‌..

BSNL: ఇటీవల అన్ని టెలికాం కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కానీ ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)

BSNL రీఛార్జ్ ప్లాన్‌లు.. సంవత్సరం కంటే ఎక్కువ వ్యాలిడిటీ.. అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్‌..
Bsnl
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Nov 29, 2021 | 5:59 PM

BSNL: ఇటీవల అన్ని టెలికాం కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కానీ ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు సరసమైన ధరలలో ప్లాన్‌లని అందిస్తుంది. 425 రోజుల వ్యాలిడిటీతో దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. మరే ఇతర టెలికాం కంపెనీ ఇప్పటివరకు 425 రోజుల వ్యాలిడిటీని అందించడం లేదు. మీరు ఫోన్‌ని మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయకూడదనుకుంటే 300 నుంచి 425 రోజుల వ్యాలిడిటీతో లాంగ్‌ టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే BSNL ప్లాన్‌లు సరిగ్గా సరిపోతాయి. BSNL రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది ప్రతిరోజూ 2GB డేటా, అపరిమిత కాలింగ్, ఉచిత 100 sms, ఉచిత రింగ్‌టోన్‌లను అందిస్తుంది. మరే ఇతర టెలికాం కంపెనీ కూడా రూ.500 కంటే తక్కువ ప్లాన్‌లో 300 రోజుల వ్యాలిడిటీని ఇవ్వడం లేదు.

BSNL దీర్ఘకాలిక ప్లాన్ రూ.1499 BSNL 24GB డేటా, ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను అందించే రూ.1499 ప్రీపెయిడ్ లాంగ్ టర్మ్ ప్లాన్‌ని కలిగి ఉంది. ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. రూ.1999 ప్లాన్ గురించి మాట్లాడితే ఇది 500GB సాధారణ డేటాతో పాటు 100GB అదనపు డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వేగం 80Kbpsకి పడిపోతుంది. ఇది ఎటువంటి FUP పరిమితి లేకుండా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ వినియోగదారులకు ఏ నెట్‌వర్క్‌లోనైనా రోజుకు 100 SMSలను అందిస్తుంది.

ఈ ప్లాన్‌లో 425 రోజుల వాలిడిటీ BSNL దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2399 చెల్లుబాటును 60 రోజులు పెంచింది. ఇప్పుడు అది 425 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 3GB తర్వాత 80 Kbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఏదైనా నెట్‌వర్క్‌లో రోజుకు 100 SMSలను పొందుతారు. BSNL కూడా రూ.1498 ప్రీపెయిడ్ వార్షిక డేటా వోచర్‌ని కలిగి ఉంది. డేటా వోచర్ రోజుకు 2GB డేటాతో అపరిమిత కాల్‌లను అందిస్తుంది. దాని గడువు ముగిసిన తర్వాత వేగం 40 KBPSకి తగ్గుతుంది.

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.1000 కంటే తక్కువ BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.1000 కంటే తక్కువ ధర 120 రోజుల నుంచి180 రోజుల మధ్య వ్యాలిడిటీ అందిస్తుంది. BSNL రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది ఇది 134 రోజుల పాటు 1.5GB రోజువారీ డేటా, ఉచిత వాయిస్ కాల్స్, 100 ఉచిత SMSలను అందిస్తుంది. ఇది మొదటి 60 రోజుల పాటు ఉచిత ట్యూన్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 120 రోజులు. BSNL రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాల్స్, 3GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, వాలిడిటీ 180 రోజులు అందిస్తుంది.

Jiophone Next: జియో ఫోన్‌ విక్రయాలు ప్రారంభం.. ధర, ఆఫర్‌లు ఏ విధంగా ఉన్నాయంటే..?

అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?

CAT 2021 Exam: CAT పరీక్ష కోసం IIM మార్గదర్శకాలు విడుదల.. ఈ విషయాలను గుర్తుంచుకోండి