AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gowtham Adani: ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా అదానీ..రెండో స్థానానికి దిగిపోయిన ముఖేష్ అంబానీ.. కారణం అదే!

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా నిలిచారు. నికర విలువ పరంగా ముఖేష్ అంబానీ కంటే ముందుకు అదానీ చేరుకున్నారు. గౌతమ్ అదానీ తొలిసారిగా ఈ ఘనత సాధించారు.

Gowtham Adani: ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా అదానీ..రెండో స్థానానికి దిగిపోయిన ముఖేష్ అంబానీ.. కారణం అదే!
Gowtham Adani
KVD Varma
|

Updated on: Nov 24, 2021 | 9:02 PM

Share

Gowtham Adani: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా నిలిచారు. నికర విలువ పరంగా ముఖేష్ అంబానీ కంటే ముందుకు అదానీ చేరుకున్నారు. గౌతమ్ అదానీ తొలిసారిగా ఈ ఘనత సాధించారు. అదానీ గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం10 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ 14.91 లక్షల కోట్లకు దిగజారింది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ముందుంది. అయితే, రిలయన్స్ లో అంబానీకి ఉన్న వాటాల కంటే.. ఆదానీకి తన స్వంత కంపెనీలో ఉన్న వాటాలు చాలా ఎక్కువ. అందుకే అదాని ధనవంతుడిగా నిలిచారు.

సౌదీ అరామ్‌కో డీల్ కుప్పకూలిన తర్వాత రిలయన్స్ పతనం మొదలైంది. ఈ తగ్గుదల బుధవారం కూడా కొనసాగింది. రిలయన్స్ షేరు బిఎస్‌ఇలో బుధవారం 1.48 శాతం క్షీణించి 2,350.90 రూపాయల వద్ద ముగిసింది. దీని కారణంగా రూ.22,000 కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ముఖేష్ అంబానీకి రూ.11,000 కోట్ల నష్టం వాటిల్లింది.

రిలయన్స్ ఇప్పటికీ అత్యంత విలువైన సంస్థ..

దాని షేర్ల పతనం తర్వాత, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 14.91 లక్షల కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ భారతదేశంలో అత్యంత విలువైన సంస్థ. ముఖేష్ అంబానీకి చెందిన మరో లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ 1.57% తగ్గి 613.85 రూపాయలకు చేరుకుంది. ఈ పతనం తర్వాత, దాని మార్కెట్ క్యాప్ రూ.926.91 కోట్లకు వచ్చింది.

పెరిగిన అదానీ నికర మార్కెట్ క్యాప్..

అదానీ గ్రూప్ సంస్థలు బుధవారం స్థూల మార్కెట్ క్యాప్‌లో 12,000 కోట్ల రూపాయలు, నికర మార్కెట్ క్యాప్‌లో 4,250 కోట్ల రూపాయలు పెరిగాయి. దీంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. మార్కెట్‌లో బుధవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 2.76 శాతం లాభంతో 1754.65 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 1,92,978.18 కోట్లకు చేరింది.

అదానీ పోర్ట్ షేర్లు 4.59% లాభంతో రూ.762.75 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 1,55,734.62కి చేరుకుంది. అదానీ పవర్ మార్కెట్ క్యాప్ రూ.40,864.27 కోట్లతో రూ.105.95 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు 0.85% క్షీణించి 1924.45కి, అదానీ గ్రీన్ ఎనర్జీ 1.37% తగ్గి 1387.7 రూపాయలకు అదానీ టోటల్ గ్యాస్ 1.58% క్షీణించి 1,648.35 రూపాయలకు చేరాయి.

ఇవి కూడా చదవండి: Hira Horse: వామ్మో.. ఈ ఖరీదైన గుర్రం ఎన్ని లీటర్ల పాలు తాగుతుందో తెలిస్తే గుండెలదిరిపోతాయి!

Smriti Irani: మిస్ ఇండియా కాలేకపోయారు..ప్రజల మనసులు కొల్లగొట్టారు..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జీవితంలో ఆసక్తికర మలుపులు!

Antarctica: అంటార్కిటికా మంచుపై తొలిసారిగా దిగి చరిత్ర సృష్టించిన ఎయిర్ బస్ ఏ 340 భారీ విమానం..