AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking Law: రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధం.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

Banking Law: రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధం.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు!
Bank
Balaraju Goud
|

Updated on: Nov 24, 2021 | 6:26 PM

Share

Govt. Privatise Public Sector Banks: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మొత్తం 26 బిల్లుల్లో బ్యాంకింగ్‌ చట్టసవరణ బిల్లు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకుగానూ 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటు 1949 బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌కు సవరణలు చేయడమే బిల్లు ఉద్దేశమని పేర్కొన్నాయి. బిల్లు ప్రవేశ పెట్టడం, పరిశీలన, ఆమోదం కోసం లిస్టయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సహా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.లక్షా 75 వేల కోట్లు సమీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రైవేటీకరించబోతున్న రెండు బ్యాంకుల పేర్లను బిల్లులో ప్రస్తావించే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బదులుగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తుందని తెలుస్తోంది. నిర్దిష్ట లక్ష్య చట్టానికి బదులుగా ఎనేబుల్ చేసే చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర సర్కార్ కసరత్తు పూర్తి చేసింది.

భారతదేశంలో, బ్యాంకులను జాతీయం చేయడానికి రెండు బలమైన ఎత్తుగడలు జరిగాయి. మొదటిది 1969లో, రెండవది 1980లో. మొత్తంగా 34 బ్యాంకులు జాతీయం చేశారు. బ్యాంకు జాతీయాకరణ ప్రక్రియ కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం రూపొందించారు. ఇది దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని జాతీయం చేయడానికి ఉపయోగపడింది. అయితే, ప్రస్తుత బ్యాంకింగ్ చట్టాలకు మార్పులు అవసరం లేని సమ్మేళనాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల రూపురేఖలు మారాయి. అయితే, బ్యాంకులను ‘జాతీయీకరణ’ లేదా ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను ప్రవేశపెట్టాలి.

ఈ నేపథ్యంలోనే రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో ముఖ్యమైన బిల్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, 2021. దీని ఉద్దేశ్యం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చట్టాన్ని సవరించనున్నట్లు తెలుస్తోంది. విస్తృత పెన్షన్ కవరేజీని ప్రోత్సహించడానికి గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన విధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను PFRDA నుండి వేరు చేయడానికి సవరణ సులభతరం చేస్తుంది. PFRDA (నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్) రెగ్యులేషన్స్ 2015లో నిర్వచించబడిన నేషనల్ పెన్షన్ స్కీమ్ ట్రస్ట్ అధికారాలు, విధులు ఈ సవరణ నిర్వచించే అవకాశం ఉంది. ట్రస్ట్ కంపెనీల ఛారిటబుల్ ట్రస్ట్‌గా వ్యవహరించనుంది.

Tamil Nadu Political Twist: చిన్నమ్మ పొలిటికల్‌ రీఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ.. అన్నాడీఎంకే నేతల కీలక భేటీ!