AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Political Twist: చిన్నమ్మ పొలిటికల్‌ రీఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ.. అన్నాడీఎంకే నేతల కీలక భేటీ!

తమిళనాడు రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. శశికళ చేరిక విషయంపై చర్చించేందుకు అన్నాడీఎంకే పార్టీల కీలక సమావేశమైంది.

Tamil Nadu Political Twist: చిన్నమ్మ పొలిటికల్‌ రీఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ.. అన్నాడీఎంకే నేతల కీలక భేటీ!
Tamil Nadu Politics
Balaraju Goud
|

Updated on: Nov 24, 2021 | 6:03 PM

Share

Tamil Nadu Political Twist: తమిళనాడు రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. శశికళ చేరిక విషయంపై చర్చించేందుకు అన్నాడీఎంకే పార్టీల కీలక సమావేశమైంది. మరోవైపు, జయ వేద నిలయం నివాసాన్ని ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు అప్పగించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో జరిగిన ఈ భేటీకి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంతో సహా అన్నాడీఎంకే సమన్వయకర్తలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. అన్నాడీఎంకే సమన్వయకర్తల సంఖ్యను 11 నుంచి 18కి పెంచాలని పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. అన్నాడీఎంకే సమన్వయ కర్తల కమిటీలో ఆరుగురు పళని వర్గానికి చెందినవాళ్లు కాగా ఐదుగురు పన్నీర్‌ వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారు.

అయితే, మాజీ సీఎం జయలలిత చెలికత్తె, సన్నిహితురాలు శశికళను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి పన్నీర్‌సెల్వం రెడీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె తరపున లాబీయింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే పళని వర్గం మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో సమన్వయకర్తల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు పన్నీర్‌ సెల్వం. ఈ ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందో అర్ధం కావడం లేదు.

మరోవైపు, తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు శశికళ తహతహలాడుతున్నారు. చిన్నమ్మ పొలిటికల్‌ రీఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసం వేదనిలయం విషయంలో మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. జయ నివాసం వేదనిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయ నివాసాన్ని ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు అప్పగించాలని కూడా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలావుంటే, జయలలిత నివాసం వేద నిలయాన్ని మెమోరియల్‌గా మార్చడానికి వీలులేదన్న కోర్టు గత అన్నాడీఎంకే ప్రభత్వం ఇచ్చిన జీవోను కొట్టేసింది. వేదనిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి హక్కులేదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు వారాల్లో వేద నిలయాన్ని దీపకు , దీపక్‌కు అప్పగించాలని కూడా మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే నేతలకు పెద్ద షాక్‌ తగిలిందని చెప్పుకోవచ్చు.

Read Also….  Chandrababu: మృతులకు చంద్రబాబు రూ.లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటన.. అధికారంలోకి రాగానే రూ. 25 లక్షలు ఇస్తాంః చంద్రబాబు