Chandrababu: మృతులకు చంద్రబాబు రూ.లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటన.. అధికారంలోకి రాగానే రూ. 25 లక్షలు ఇస్తాంః చంద్రబాబు
Chandrababu Floods Tour: చిత్తూరు జిల్లా తిరుపతి పరిధిలో వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్ గా ఉన్న..
Chandrababu Floods Tour: చిత్తూరు జిల్లా తిరుపతి పరిధిలో వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్ గా ఉన్న రాయల చెరువు ని చంద్రబాబు పర్యటించారు. కట్ట వద్ద జరుగుతున్న మరమత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం పై సీఎం జగన్ పై మళ్ళీ సంచలన కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లాలో భయానక వాతావరణం సృష్టించిన రాయల చెరువును పరిశీలించానని అన్నారు. అంతేకాదు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో 40 మంది మరణించారని.. నిజానికి చిత్తూరు జిల్లాలో వర్షాలు పడటం కొత్తేమి కాదని అన్నారు. అయితే భారీ వర్షాలు వస్తాయని ముందుగానే వాతావరణశాఖ హెచ్చిరించినా.. ఏపీ ప్రభుత్వం ముందుగా తగిన చర్యలు తీసుకోలేదని.. పూర్తిగా విఫలం కావడంతోనే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు సంచలన కామెట్న్స్ చేశారు.
చిత్తూర జిల్లాలోని ప్రస్తుత పరిస్థితికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే నని చెప్పారు చంద్రబాబు, అంతేకాదు తుమ్మల గుంట చెరువును క్రికెట్ గ్రౌండ్ చేసుకోవడంతో తిరుపతి నగరం మునిగిపోయింది. ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడూ పని చేయకూడదని హితవు పలికారు. చెక్ డ్యామ్ లు, బ్రిడ్జిలు కొట్టుకుపోవడానికి ప్రభుత్వమే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని అన్నారు.
తాను రాయల చెరువు వద్దకు పర్యటనకు వస్తే.. ప్రభుత్వం అప్రమత్తమవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు. తన ప్రభుత్వ హాయంలో సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టుకు ప్లాన్ చేశామని గుర్తు చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్, మంత్రులు పర్యటించి.. ప్రజలకు భరోసానిచ్చి ఉంటే రాయల చెరువు చుట్టూ పక్కల ప్రజలు ఆనందంగా నిద్రపోయేవారని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఇంకా కష్టాల్లోకి నెట్టే ప్రభుత్వ చర్యలు పద్ధతి కాదన్నారు. రౌతు కొద్ది గుర్రం లాగా నడిపించేవారు సక్రమంగా నడిపిస్తే అందరూ బాగుంటారని చెప్పారు. అంతేకాదు తాజాగా వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు టీడీపీ తరపున రూ.1 లక్ష ఎక్స్ గ్రేషియాను ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..అప్పుడు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Also Read: అరుదైన వ్యాధిపడిన కొడుకు.. బతికించుకోడానికి తండ్రి తాపత్రయం.. ఏకంగా మందుని కనిపెట్టిన కన్న ప్రేమ.. టీడీపీ అధినేత రాయల చెరువు పర్యటన వివాదాస్పదం.. అనుమతి లేదంటున్న పోలీసులు.. వెళ్తానంటున్న చంద్రబాబు