Chandrababu: వద్దన్నా రాయల చెరువు కట్ట వద్దకు వెళ్లిన చంద్రబాబు.. మరమత్తు పనుల పరిశీలన..
Chandrababu Floods Tour: ప్రతి పక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి లోని వరదబాధిత ప్రాంతాల్లో చేపట్టిన పర్యటన వివాదాస్పదంగా మారుతుంది. తాజాగా చంద్రబాబు రాయల..
Chandrababu Floods Tour: ప్రతి పక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి లోని వరదబాధిత ప్రాంతాల్లో చేపట్టిన పర్యటన వివాదాస్పదంగా మారింది. రాయల చెరువు పర్యటనకు తిరుపతి పోలీసులు అనుమతిని నిరాకరించినా టీడీపీ అధినేత చంద్రబాబు రాయల చెరువు కట్టవద్దకు చేరుకున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
అయితే ఇటీవల వర్షాలకు రాయల్ చెరువుని ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించింది. అంతేకాదు రాయల చెరువు వద్ద కట్ట మరమత్తు పనులు జరుగున్నాయి కనుక చంద్రబాబుని పర్యటనకు అనుమతినివ్వలేమంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాయల్ చెరువు కట్ట తెగితే కనీసం వంద గ్రామాలకు ముప్పు ఉంటుందని అధికారులు గతంలో అలెర్ట్ కూడా చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పనులకు అడ్డంకి కలిగించవద్దని పోలీసులు టీడీపీ నేతలను కోరారు.
పాపనాయుడుపేట, తిరుచానూరులో పర్యటన అనంతరం, రాయల చెరువు కి చంద్రబాబు వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు రాయల చెరువు పర్యటనకు పోలీసులు అనుమతినివ్వకపోయినా వెళ్తానని చంద్రబాబు చెప్పారు. అదే విధంగా రాయల చెరువు వద్దకు చేరుకొని పనులను పరిశీలించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Also Read: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి.. భారతీయ సంప్రదాయంలో వివాహం