AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBN-Chevireddy: రాయల చెరువు వద్ద ఇంట్రస్టింగ్ సీన్.. కాన్వాయ్‌లో వెళ్తున్న బాబుకు చెవిరెడ్డి నమస్కారం

తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు.

CBN-Chevireddy: రాయల చెరువు వద్ద ఇంట్రస్టింగ్ సీన్.. కాన్వాయ్‌లో వెళ్తున్న బాబుకు చెవిరెడ్డి నమస్కారం
చంద్రబాబుకు నమస్కారం పెట్టిన చెవిరెడ్డి
Ram Naramaneni
|

Updated on: Nov 24, 2021 | 6:06 PM

Share

తిరుపతి సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయల చెరువును పరిశీలించిన ఆయన.. చెరువు కట్టకు చేస్తున్న మరమ్మతులను పరిశీలించారు. చెరువు ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదినక పనులు పూర్తి చేయాలని కోరారు. మరమ్మతులు వేగవంతం చేయకుంటే.. ప్రమాదం జరిగే అవకాశముందని అన్నారు. కాగా బాబు పర్యటన సందర్భంగా ఇక్కడ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి… చంద్రబాబు కనిపించగానే లేచి నిల్చుని నమస్కారం చేశారు. అయితే చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారా లేదా అన్నది విజువల్స్‌లో సరిగ్గా కనిపించలేదు. ప్రస్తుతం ఏపీలో నడుస్తోన్న పొలిటికల్ హీట్ నేపథ్యంలో ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురించేసింది.

తిరుపతి రూరల్ ప్రాంతాన్ని భయపెడుతున్న రాయల చెరువును పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొలుత పర్మిషన్ లేదన్నారు పోలీసులు. రాయలచెరువును రెడ్ జోన్‌గా గుర్తించినట్లు వివరించారు. చెరువుకు గండి పడడంతో మరమ్మతులు పనులు జరుగుతున్నాయని.. చంద్రబాబు కాన్వాయ్‌ వచ్చేందుకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఆయనకు భద్రత కల్పించలేమంటూ చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు నానికి నోటీస్‌ ఇచ్చారు స్థానిక DSP. దీంతో.. అక్కడ పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. అయినప్పటికీ చంద్రబాబు అక్కడికి చేరుకుని రాయలచెరువును పరిశీలించారు.

Also Read: గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్

రోడ్లపైనే చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే.. ఎగబడ్డ జనం

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!