Anantapur district: రోడ్లపైనే చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే.. ఎగబడ్డ జనం

అనంతపురం జిల్లాలో మాత్రం చేపల కోసం జనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి. 

Anantapur district: రోడ్లపైనే చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే.. ఎగబడ్డ జనం
Fishing On Roads
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 24, 2021 | 4:16 PM

చేపలు పట్టాలంటే ఊరి చివరన ఉన్న కాల్వల వద్దకో.. చెరువుల వద్దకే  దగ్గరికో వెళ్తారు. లేదా మత్సకారులు పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం చేపల కోసం జనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

అనంతపురం జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు వచ్చాయి. కేవలం నాలుగు రోజులు కురిసిన వర్షం.. జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లాలో ఉన్న పిల్ల కాలువ దగ్గర నుంచి వాగులు, వంకలు.. పొంగిపొర్లాయి. భూగర్భజలాలు పెరిగాయి. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే జిల్లాలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో చేపల జాతర సాగుతోంది. గతంలో చుక్క నీటి కోసం అల్లాడిపోయిన ప్రాంతాల్లో భారీ నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహాల్లో పెద్ద ఎత్తున చేపలు కనిపిస్తుండటంతో జనం చేపల పట్టేందుకు భారీగా అక్కడికి వస్తన్నారు. క్వింటాల్ కొద్దీ చేపలను రోడ్లలో పడుతున్నారు. రోడ్లపై చేపలు దొరకుతున్న విషయం తెలిసి.. జనం వాటి కోసం ఎగబడ్డారు. దొరికినవారు ఎంచక్కా వాటిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. చెరువులు, వంకల వద్ద చేపలు పట్టేందుకు జనం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. శింగనమల చెరువు దగ్గరకి.. వందల సంఖ్యలో జనం వచ్చి చేపలు పడుతున్నారు.

Also Read: టమాటా రేటు పెరిగింది.. పంట పండింది.. కుబేరుడైన కర్నూలు జిల్లా రైతు

ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు