BSNL Diwali Offer 2025: బంపర్ ఆఫర్.. రూ.1కే నెల రోజుల పాటు ఉచిత ఇంటర్నెట్
BSNL diwali offer 2025: దీపావళి సందర్భంగా, ప్రముఖ టెలికాం కంపెనీ BSNL తన ఇన్‌కమింగ్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ కంపెనీ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15, 2025 వరకు ఒక నెల పాటు ఉచిత 4G సేవను అందిస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూపాయికే నెల పాటు ఉచిత డేటాను అందించనుంది.

దేశ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( BSNL ) తమ యూజర్స్ కోసం దీపావళికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సరికొత్త ఆఫర్‌ను పరిచయం చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త కస్టమర్లు ఇప్పుడు కేవలం రూ.1 పెట్టి కొత్త సిమ్ కొంటే ఒక నెల పాలు ఉచిత 4G మొబైల్ డేటాను పొందవచ్చు. ఈ దీపావళి బొనాంజా ఆఫర్ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటేడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS ను పొందవచ్చు.
ఈ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌తోనే ఉండేలా మా నెట్‌వర్క్ పనిచేస్తుందని BSNL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ A. రాబర్ట్ J. రవి అన్నారు. ఈ దీపావళి బోనస్ మా 4G నెట్‌వర్క్‌ను యూజ్ చేసే కస్టమర్లకు గర్వాన్ని అందిస్తుందన్నారు. ఈ సేవ నాణ్యత వారిని ఎల్లకాలంలో మాతోనే ఉంచేందుకు సహాయపడుతుందన్నారు.
BSNL దీపావళి ఆఫర్ ఎలా పొందాలి?
మీరు బీఎస్‌ఎన్‌ఎస్‌కు కొత్త కస్టమర్ అయితే అక్టోబర్ 15, నవంబర్ 15 మీరు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అందుకోసం మీరు మీ దగ్గర్లోని BSNL స్టోర్‌కు వెళ్లి రూ.1 పెట్టి కొత్త సిమ్ కార్డు తీసుకొండి. ఆ సిమ్ కార్డు నంబర్ 15లోపు యాక్టీవేట్ అయితే మీరు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.




