AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Schemes: ఆదాయపు పన్ను ఆదా చేసే పోస్ట్‌ ఆఫీస్‌ పథకాలు.. మార్చి 31 వరకు అవకాశం!

Best Post Office Schemes: ఈ పథకాలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందించడమే కాకుండా సెక్షన్ 80C, 80TTA కింద పన్ను మినహాయింపును కూడా అందిస్తాయి. మీరు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేయాలనుకుంటే మార్చి 31, 2025 వరకు..

Post Office Schemes: ఆదాయపు పన్ను ఆదా చేసే పోస్ట్‌ ఆఫీస్‌ పథకాలు.. మార్చి 31 వరకు అవకాశం!
16,650 రూపాయలు ఎలా పొందాలి?: మీరు పోస్ట్ ఆఫీస్ MIS పథకంలో రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి నెలా రూ. 5,550 లభిస్తుంది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన రూ. 16,650 అవుతుంది. ఈ పథకం కాల పరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. మీరు జాయింట్ ఖాతా ఓపెన్ చేసి రూ. 15 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. అప్పుడు నెలకి రూ. 9250 వడ్డీ మీ బ్యాంకు ఖాతాలోకి వస్తుంది.
Subhash Goud
|

Updated on: Mar 09, 2025 | 12:11 PM

Share

ప్రతి వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటాడు. పన్నులను కూడా ఆదా చేయాలనుకుంటారు. సురక్షితమైన పెట్టుబడితో పాటు పన్ను ప్రయోజనాలను పొందాలనుకునే పెట్టుబడిదారులకు పోస్ట్ ఆఫీస్ వివిధ పథకాలు ఒక అద్భుతమైన ఎంపిక. ఈ పథకాలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందించడమే కాకుండా సెక్షన్ 80C, 80TTA కింద పన్ను మినహాయింపును కూడా అందిస్తాయి. మీరు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేయాలనుకుంటే మార్చి 31, 2025 వరకు ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉంది. ఈ పథకాల గురించి తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా:

  • మీరు కనీసం 500 రూపాయలతో ప్రారంభించవచ్చు.
  • సెక్షన్ 80TTA కింద 4% వార్షిక వడ్డీ, రూ. 10,000 వరకు పన్ను మినహాయింపు.

5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ RD (రికరింగ్ డిపాజిట్):

  • నెలకు కనీసం 100 రూపాయల నుండి పెట్టుబడి పెట్టవచ్చు.
  • 6.7% వడ్డీ రేటు, 5 సంవత్సరాల కాలపరిమితి.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD):

  • 1 నుండి 5 సంవత్సరాల వరకు పెట్టుబడి ఎంపిక, 5 సంవత్సరాలకు 7.5% వడ్డీ.
  • 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడిపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు.

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS):

  • సింగిల్ అకౌంట్ కు రూ. 9 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ కు రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • 7.4% వడ్డీ, నెలవారీ పెన్షన్ లాంటి ఆదాయం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):

  • 60 ఏళ్లు పైబడిన వారికి 8.2% వడ్డీ రేటు.
  • 30 లక్షల వరకు పెట్టుబడి, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):

  • 15 సంవత్సరాల ప్రణాళిక. వార్షిక పెట్టుబడి రూ.500 నుండి రూ. 1.5 లక్షల వరకు.
  • 7.1% వడ్డీ, పూర్తి పన్ను మినహాయింపు (80C, వడ్డీ కూడా పన్ను రహితం).

జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC):

  • 5 సంవత్సరాల ప్రణాళిక. 7.7% వడ్డీ.
  • సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు

కిసాన్ వికాస్ పత్ర (KVP):

  • డబ్బు 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. వడ్డీ రేటు 7.5%.
  • సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక.
  • 80C కింద పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు

సుకన్య సమృద్ధి యోజన (SSA):

  • బాలికల కోసం ప్రత్యేక పథకం. 8.2% వడ్డీ.
  • 80C కింద పన్ను మినహాయింపు, వడ్డీ కూడా పన్ను రహితంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Best Investment Plan: మీకు రూ.20 వేల జీతం ఉందా? నెలకు రూ.4 వేల ఇన్వెస్ట్‌తో కోటి రూపాయలు.. ఎలా సాధ్యం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి