Business Idea: ‘బంగారం లాంటి వ్యాపారం’.. ఫుల్‌ డిమాండ్‌, భారీగా ఆదాయం

ప్రస్తుతం బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ. 73 వేలకు చేరుకుంది. భవిష్యత్తులో తులం ధర రూ. లక్షకు చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది రోల్డ్‌ గోల్డ్‌ను ఉపయోగిస్తున్నారు. అచ్చంగా బంగారు నగలను పోలి ఉండే గిల్టీ నగలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవ్చు...

Business Idea: 'బంగారం లాంటి వ్యాపారం'.. ఫుల్‌ డిమాండ్‌, భారీగా ఆదాయం
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2024 | 4:02 PM

వ్యాపారం చేయాలనే ఆలోచనలలో చాలా మందికి ఉంటుంది. కానీ మార్కెట్లో నెలకొన్ని పోటీనేపథ్యంలో చాలా మంది బిజినెస్‌ ప్రారంభించాలని ఉన్నా వెనుకడుగు వేస్తుంటారు. అందులోనూ పెట్టుబడికి భయపడి, లాభాలు వస్తాయో.. రావో అనే ఆలోచనతో వ్యాపారం చేయాలన్ని విరమించుకుంటారు. అయితే ఎవరూ చేయని వ్యాపారాలను ప్రారంభించి లక్షల్లో ఆర్జిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మార్కెట్ అవసరాలను గుర్తించి, ఆ రంగంలో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం పొందొచ్చు. అలాంటి ఓ డిఫ్రెంట్ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..

ప్రస్తుతం బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ. 73 వేలకు చేరుకుంది. భవిష్యత్తులో తులం ధర రూ. లక్షకు చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది రోల్డ్‌ గోల్డ్‌ను ఉపయోగిస్తున్నారు. అచ్చంగా బంగారు నగలను పోలి ఉండే గిల్టీ నగలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవ్చు.

ఇందులో రెండు రకాల వ్యాపారాలు చేయొచ్చు. ఒకటి హోల్‌సేల్‌గా గిల్టీ నగలను పెద్ద పెద్ద దుకాణాల్లో కొనుగోలు చేసి స్థానికంగా మీరు స్వయంగా విక్రయించవచ్చే లేదంటే. నేరుగా దుకాణాలకు కూడా డిస్ట్రిబ్యూట్‌ చేయొచ్చు. అదే విధంగా మీరే స్వయంగా గిల్టీ నగలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో మేకింగ్ మిషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముందుగా రాగితో తయారు చేసిన ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అనంతరం వీటిపై గోల్డ్ ప్లేటింగ్ వేయాల్సి ఉంటుంది. వీటికి అవసరమయ్యే మిషనరీలతో పాటు శిక్షణ ఇచ్చే సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఆన్‌లైన్‌తో పాటు, యూట్యూబ్‌లోనూ చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి వారిని నమ్మే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయకుండా, మిషనరీ తీసుకున్న తర్వాతే డబ్బులు ఇవ్వడం లాంటివి చేయాలి. ఈ వ్యాపారంతో లాభాలు కూడా భారీగానే ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో గిల్ట్ నగలకు ఉన్న డిమాండే దీనికి కారణంగా చెప్పొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..