Hyundai Aura Hy-CNG E: సీఎన్‌జీలో సరికొత్త ‘ఆరా’ ప్రారంభం.. లుక్ ఎలా ఉందంటే..
ప్రముఖ కార్ల తయారీదారైన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మరో కొత్త సీఎన్‌జీ వేరియంట్ కారును ఆవిష్కరించింది. ఇప్పటికే ఉన్న హ్యూందాయ్ ఆరా సీఎన్‌జీకి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఆరా హై-సీఎన్జీ ఈ(Aura Hy- CNG E) కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.49 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా పేర్కొంది.
ప్రస్తుతం అంతా పర్యావరణహితమైన వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఎలక్ట్రిక్‌తో పాటు కంప్రెస్సెడ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ) వాహనాలకు కూడా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో అన్ని కంపెనీలు ఆ వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీదారైన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మరో కొత్త సీఎన్‌జీ వేరియంట్ కారును ఆవిష్కరించింది. ఇప్పటికే ఉన్న హ్యూందాయ్ ఆరా సీఎన్‌జీకి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఆరా హై-సీఎన్జీ ఈ(Aura Hy- CNG E) కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.49 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా పేర్కొంది. అయితే డ్యూయల్ సిలెండర్ టెక్నాలజీతో రాలేదు. ఇప్పటికే ఎక్స్‌టర్, గ్రాండ్ ఐ10 నియోస్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో మార్కెట్లో ఉన్నాయి. ఆరా సీఎన్‌జీ వేరియంట్‌ను దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి.
హ్యుందాయ్ ఆరా హై-సీఎన్జీ ఈ ఫీచర్లు..
హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ సెడాన్‌గా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ముందు పవర్ విండోస్, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు, అడ్జస్టబుల్ రియర్ సీట్ హెడ్ రెస్ట్లు, మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ ప్లేతో వస్తుంది. దీనిలోనే స్పీడోమీటర్ ఉంటుంది. జెడ్ ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లను కూడా కలిగి ఉంటుంది.
హ్యుందాయ్ ఆరా హై-సీఎన్జీ ఈ భద్రతా ఫీచర్లు..
ఈ సెడాన్లో ఆరు ఎయిర్ బ్యాగ్లు, 3-పాయింట్ సీట్ బెల్టు (అన్ని సీట్లు), సీట్బెల్ట్ రిమైండర్లు (అన్ని సీట్లు), ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఇమ్మొబిలైజర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, వెనుకవైపు పార్కింగ్ సెన్సార్లతో వస్తుంది.
హ్యుందాయ్ ఆరా హై-సీఎన్జీ ఈ స్పెక్స్
ఈ సెడాన్ కారులో 1.2ఎల్ బై ఫ్యూయల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో జత చేసి ఉంటుంది. సీఎన్‌జీ ఇంజిన్ 6000ఆర్పీఎం వద్ద 69బీహెచ్‌పీ గరిష్ట శక్తి, 4,000ఆర్పీఎం వద్ద 95.2ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. పెట్రోల్‌పై నడుస్తున్నప్పుడు, 82 బీహెచ్‌పీ, 113ఎన్‌ఎం వరకూ అందిస్తుంది.
ఎక్కడా రాజీ లేదు..
ఈ కారు లాంచ్ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హెూల్ టైమ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ఆవిష్కరించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. హ్యుందాయ్ ఆరా హై- సీఎన్జీ ఈ ట్రిమ్ అనేది స్టైల్, సేఫ్టీ లేదా పెర్ఫార్మెన్స్‌లో ఎక్కడా రాజీ పడకుండా తయారు చేశామన్నారు. ఆరా సీఎన్‌జీ ఇప్పటికే 200,000 యూనిట్లకు పైగా విక్రయాలు జరపిందన్నారు. ఇది సాధారణ సెడాన్ కంటే ఎక్కువ సౌలభ్యం, అధునాతన సాంకేతికత, ఆధునికత కలగలుపుకొని రూపొందిందన్నారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ తమ కస్టమర్లకు యాజమాన్య అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..