Home Loans: ఈ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను పెంచిన నేపథ్యంలో బ్యాంకులు తమ రుణాలను నిరంతరం ఖరీదైనవిగా మారుస్తున్నాయి. అయితే అయితే బ్యాంకు రుణాలు..

Home Loans: ఈ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు
Home Loans
Follow us

|

Updated on: Nov 12, 2022 | 10:26 AM

రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను పెంచిన నేపథ్యంలో బ్యాంకులు తమ రుణాలను నిరంతరం ఖరీదైనవిగా మారుస్తున్నాయి. అయితే అయితే బ్యాంకు రుణాలు ఖరీదైనవి అయినా ఒక బ్యాంకు తన కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిమిత కాలానికి తన గృహ రుణంలో కోత ప్రకటించింది. దీనితో పాటు ఈ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజులో కూడా బ్యాంక్ ఉపశమనం ప్రకటించింది. ఈ తగ్గింపుతో గృహ రుణ రేట్లు పరిశ్రమలో అత్యల్ప స్థాయికి పడిపోయాయని బ్యాంక్ పేర్కొంది. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ ఏమిటి?

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) శుక్రవారం తన గృహ రుణ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించడంతో ప్రస్తుత 8.25 శాతానికి చేరుకుంది. దీనితో పాటు, అప్లికేషన్ డిస్పోజల్ కోసం వసూలు చేసే రుసుము అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కూడా పరిమిత సమయం వరకు మాఫీ చేయబడింది. బ్యాంకు అందించే ఈ గృహ రుణ రేటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కంటే తక్కువగా ఉంది. వీటి కొత్త రేట్లు 8.40 శాతంగా ఉంది.

కొత్త రేటు వచ్చే సోమవారం నుండి వర్తిస్తుందని, డిసెంబర్ చివరి వరకు అమలులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంకు ఆఫ్‌ బరోడా జనరల్ మేనేజర్ (మార్ట్‌గేజ్ అండ్‌ రిటైల్ అసెట్ బిజినెస్) హెచ్‌టి సోలంకి మాట్లాడుతూ.. మా గృహ రుణ రేట్లు ఇప్పుడు పరిశ్రమలో అత్యంత పోటీగా ఉన్నాయి. వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా మాఫీ చేస్తున్నాం అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మే తర్వాత రిజర్వ్ బ్యాంక్ నిరంతరం కీలక రేట్లను పెంచుతోంది. దీంతో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఈఎంఐల ప్రభావం డిమాండ్‌పై కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్‌పై జరిగే కొనుగోళ్లపై దీని ప్రభావం కనిపించింది. డిమాండ్‌ను కొనసాగించడం కోసమే బ్యాంకులు భవిష్యత్తులో ఇలాంటి ఆఫర్‌లను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి