Savings: పొదుపు అధికంగా చేసే రాష్ట్రాలు ఏవో తెలుసా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ స్థానంలో ఉన్నారంటే..

జీవితంలో ఎంత సంపాదిస్తున్నా.. ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా.. పొదుపు అనేది చాలా ముఖ్యం. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయో ముందే అంచనా వేయడం చాలా కష్టం. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు..

Savings: పొదుపు అధికంగా చేసే రాష్ట్రాలు ఏవో తెలుసా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ స్థానంలో ఉన్నారంటే..
Savings
Follow us
Amarnadh Daneti

| Edited By: Anil kumar poka

Updated on: Nov 12, 2022 | 3:08 PM

జీవితంలో ఎంత సంపాదిస్తున్నా.. ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా.. పొదుపు అనేది చాలా ముఖ్యం. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయో ముందే అంచనా వేయడం చాలా కష్టం. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటారు. కాని ఈ పొదుపు వ్యక్తి యొక్క ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. అలాగే అన్ని ప్రాంతాల్లో పొదుపు ఒకే విధంగా ఉండదు. మన చుట్టూ ఉండే ప్రజల ప్రభావంపై కూడా సేవింగ్స్ ఆధారపడి ఉంటాయి. ఓ సర్వే ప్రకారం దేశం మొత్తం మీద సేవింగ్స్ చేసే వారు 70%గా ఉండగా.. రాష్ట్రాల వారీ 88 శాతం జనాభాతో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. దేశంలోనే ఎక్కువుగా పొదుపు చేసే జనాభా ఉన్న రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. మైక్రో సేవింగ్స్ పథకాల ద్వారా పొదుపు చేస్తున్న వారు పశ్చిమబెంగాల్‌లో 84శాతం మంది కాగా.. దేశంలో అధికంగా పొదుపు చేస్తున్న జనాభా కలిగిన రాష్ట్రాల జాబితాలో వెస్ట్ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. సాంప్రదాయ పొదుపు పథకాలతో పోలిస్తే గుజరాత్, పంజాబ్‌ ప్రజలు క్యాపిటల్ మార్కెట్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా పొదుపుమార్గాన్ని ఎంచుకున్నారు. క్యాపిటల్ మార్కెట్‌పై ఇక్కడి ప్రజలు ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కుటుంబాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఆదా చేస్తున్నట్లు మనీ9 సర్వేలో తేలింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రజలు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఎక్కువుగా ఆదా చేస్తున్నట్లు తేలింది. చిన్న పొదుపు పథకాలు ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందాయి. గుజరాత్, పంజాబ్‌ ప్రజలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పొదుపు పథకాల్లో తక్కువ సేవింగ్స్ చేసినప్పటికి.. ఆ రాష్ట్రాల ప్రజలు క్యాపిటల్ మార్కెట్లలో క్రియాశీల పెట్టుబడిదారులుగా ఉన్నారని సర్వేలో తేలింది.

దేశ వ్యాప్తంగా 70 శాతం కుటుంబాలు పొదుపు చేస్తున్నాయి. సేవింగ్స్ లో దేశంలో కర్ణాటక అగ్రగామిగా ఉండగా, అతి తక్కువ పొదుపు చేసే రాష్ట్రంగా బీహార్ నిలిచింది. కర్ణాటకలోని కుటుంబాలు పొదుపునకు ప్రాధాన్యత ఇస్తాయని సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్‌లోని కుటుంబాలు ఎక్కువుగా సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 72 శాతం కుటుంబాలు పొదుపు చేస్తుండగా.. దేశంలో పొదుపు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో 70 శాతంతో రాజస్థాన్, 67 శాతంతో గుజరాత్‌ నిలిచాయి.

ఈ సర్వే ప్రకారం పంజాబ్‌లోని దాదాపు 63 శాతం కుటుంబాలు పొదుపుపై ​​దృష్టి పెడుతున్నాయి. బీహార్, జార్ఖండ్ లో పొదుపు చేస్తున్న కుటుంబాల శాతం చాలా తక్కువుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 62 శాతం కుటుంబాలు పొదుపు మార్గాన్ని ఎంచుకోగా.. ఈ రాష్ట్రాలు సంయుక్తంగా 12వ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్‌ నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 51 శాతం కుటుంబాలు మాత్రమే తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్నాయి. బీహార్‌లో కేవలం 50 శాతం కుటుంబాలు మాత్రమే సేవింగ్స్‌పై దృష్టిసారిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?