Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Rupee: డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? దీని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

నగదుకు బదులు డిజిటల్ కరెన్సీని వినియోగించే ట్రెండ్ పెరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే, భారతదేశంలో కూడా క్రిప్టోకరెన్సీని..

Digital Rupee: డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? దీని వల్ల  ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి
Digital Rupee
Follow us
Subhash Goud

|

Updated on: Nov 12, 2022 | 11:32 AM

నగదుకు బదులు డిజిటల్ కరెన్సీని వినియోగించే ట్రెండ్ పెరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే, భారతదేశంలో కూడా క్రిప్టోకరెన్సీని ఉపయోగించే ట్రెండ్ మొదలైంది. అయితే కరెన్సీ వల్ల కలిగే ప్రయోజనాలు ఎంతగానో ఉన్నట్లే నష్టాలు కూడా చాలా ఎక్కువ. ఆన్‌లైన్ మోసం నుండి ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు వరకు రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా దేశీయ డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌ను ఈ నెల 1 నుండి ప్రారంభించింది. డిజిటల్ కరెన్సీ త్వరలో రిటైల్ లేదా మార్కెటింగ్‌లో కూడా ఉపయోగించబడుతుంది.

సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలువబడే డిజిటల్ రూపాయి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. డిజిటల్ కరెన్సీ వినియోగం వాణిజ్యంలో పెను మార్పులకు దారి తీస్తుంది. ఈ నాణేలపై ప్రభుత్వ ముద్ర ఉండడంతో ఆర్థిక మోసం, నష్టం జరిగే అవకాశం ఉండదు.డిజిటల్ రూపాయి కోసం తొమ్మిది బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫాస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులు ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, డిజిటల్ రూపాయిని ప్రారంభించడంలో కొన్ని సాంకేతిక, విధానపరమైన సమస్యలు ఉంటాయి. అయితే ఆర్‌బీఐ అన్ని సమస్యలను తొలగించి ఎలాంటి అడ్డంకులు లేని విధంగా సీబీడీసీని మార్కెట్‌లోకి తీసుకువస్తుంది.

ఇవి కూడా చదవండి

డిజిటల్ రూపాయి అంటే ఏమిటి?

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతోపాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్‌బీఐ డిజిటల్ రూపాయి తీసుకొస్తోంది. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు. ప్రపంచంలో ఉన్న వర్చువల్ కరెన్సీ. ఇ-రూపాయి డబ్బు లావాదేవీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. నోట్ల ప్రింటింగ్ ఖర్చు కూడా ఉండదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఎక్స్ఛేంజ్ సాధ్యమవుతుంది. ఎటువంటి అదనపు లావాదేవీ రుసుము లేకుండా అన్ని చెల్లింపులు చేయవచ్చు. సీబీడీసీ లేదా ఈ-రూపాయిలు నిజమైన కరెన్సీకి సమానం. అందుకే కాగితం నోట్లకు బదులుగా ఈ కరెన్సీ కూడా ఉపయోగించబడుతుంది.

డిజిటల్ రూపాయి ప్రయోజనాలు:

యూపీఐ ద్వారా లావాదేవీలకు వినియోగదారుకు బ్యాంక్ ఖాతా అవసరం. డిజిటల్ కరెన్సీలకు బ్యాంక్ ఖాతా అవసరం లేదు. డిజిటల్ కరెన్సీలకు గడువు తేదీ ఉండదు. ఈ డిజిటల్ కరెన్సీని జీవితాంతం ఉపయోగించుకోవచ్చు. అలాగే, డిజిటల్ కరెన్సీ ఏ విధంగానూ దెబ్బతినదు లేదా నాశనం చేయబడదు. బిట్‌ కాయిన్‌ వంటి కరెన్సీలలో ఈ-రూపాయిలు ఆర్థిక ప్రమాదానికి అవకాశం లేదు.

ఈ-రూపాయిల వినియోగం వల్ల ప్రభుత్వానికి కూడా చాలా డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే కాగితపు నోట్ల విషయంలో ముద్రణ, పంపిణీ, నిల్వకు ఎటువంటి ఖర్చు ఉండదు. కాగితంపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల పర్యావరణం కూడా ఆదా అవుతుంది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి