US Treasury: యూఎస్‌ కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్‌ను తొలగించిన అమెరికా

అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తన కరెన్సీ మానిటరింగ్ జాబితా నుండి భారతదేశాన్ని తొలగించింది. గత రెండేళ్లుగా భారత్ ఈ జాబితాలో ఉంది. భారత్‌తో పాటు ..

US Treasury: యూఎస్‌ కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్‌ను తొలగించిన అమెరికా
Us Treasury
Follow us
Subhash Goud

|

Updated on: Nov 12, 2022 | 7:03 AM

అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తన కరెన్సీ మానిటరింగ్ జాబితా నుండి భారతదేశాన్ని తొలగించింది. గత రెండేళ్లుగా భారత్ ఈ జాబితాలో ఉంది. భారత్‌తో పాటు ఇటలీ, మెక్సికో, థాయ్‌లాండ్, వియత్నాంలను కూడా అమెరికా కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి తొలగించింది. దీని కింద ప్రధాన వ్యాపార భాగస్వాముల కరెన్సీ కార్యకలాపాలు, స్థూల ఆర్థిక విధానాలు నిశితంగా పరిశీలించబడతాయి. ఇప్పటివరకు ఈ జాబితాలో భారత్‌తో పాటు జపాన్‌, చైనా, దక్షిణ కొరికాయ, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, తైవాన్‌, జర్మనీ, వియత్నాం, మెక్సికోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలో మిగతా ఏడు దేశాలు ఉన్నట్లు కాంగ్రెస్‌కు సమర్పించిన తన ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది.

ఈ జాబితాలో చైనాతో సహా ఈ దేశాలు

ప్రస్తుత ఈ జాబితాలో చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, మలేషియా, సింగపూర్, తైవాన్ ఏడు దేశాలు ఉన్నాయని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పార్లమెంటుకు తెలిపింది. జాబితా నుండి తొలగించబడిన దేశాలు వరుసగా రెండు నివేదికలలో మూడు ప్రమాణాలలో ఒకదాన్ని మాత్రమే నెరవేర్చాయని నివేదిక పేర్కొంది. విదేశీ మారకపు జోక్యాన్ని ప్రచురించడంలో విఫలమైనందుకు, దాని మార్పిడి రేటు విధానంలో పారదర్శకత లోపించినందుకు చైనా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నిశిత పర్యవేక్షణలో ఉందని నివేదిక పేర్కొంది. ప్రధాన వ్యాపార భాగస్వాముల కరెన్సీ కార్యకలాపాలు, స్థూల ఆర్థిక విధానాలు నిశితంగా పరిశీలించబడతాయి.

కరెన్సీ మానిటరింగ్ జాబితా అంటే ఏమిటి?

అమెరికా తన ప్రధాన భాగస్వామి దేశాల కరెన్సీని పర్యవేక్షించడానికి కరెన్సీ మానిటరింగ్ జాబితాను సిద్ధం చేస్తుంది. ప్రధాన వాణిజ్య భాగస్వాముల కరెన్సీ కార్యకలాపాలు, స్థూల ఆర్థిక విధానాలపై నిశితంగా పరిశీలిస్తుంది. అమెరికా ఆ దేశాలను తన కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో ఉంచుతుంది. గత రెండేళ్లుగా అమెరికా కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో భారత్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

గత ఏడాది ఏప్రిల్‌, డిసెంబర్‌కు సంబంధించిన ఆర్థిక నివేదికల్లో వెలుగుచూసిన రెండు కారణాల వల్ల భారత్‌ను ఈ జాబితాలో కొనసాగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ జూన్‌లో కాంగ్రెస్‌కు ఒక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయ స్థాయిలో భారత్‌కు మిగులు ఉండటం, ఫోరెక్స్‌ మార్కెట్లపై ఏకపక్షంగా జోక్యం చేసుకోవడాన్ని సదరు కారణాలుగా చూపింది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి