Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వీటిపై అదనపు ప్రయోజనం
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచింది. 50 కోట్ల కంటే ఎక్కువ, 200 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న రిటైల్ సేవింగ్స్..
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచింది. 50 కోట్ల కంటే ఎక్కువ, 200 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న రిటైల్ సేవింగ్స్ ఖాతాలపై కూడా వడ్డీ రేట్లు 0.25 శాతం పెంచినట్లు బ్యాంక్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇది కాకుండా, దేశీయ, నాన్-రెసిడెంట్ సాధారణ (ఎన్‌ఆర్‌ఓ) 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు 6.10 శాతం వడ్డీ లభిస్తుంది. అంతకుముందు ఇది 5.10 శాతంగా ఉంది. అదే సమయంలో ఇప్పుడు ఒకటి నుండి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ డిపాజిట్లపై 6.10 శాతం చొప్పున వడ్డీ ఇవ్వబడుతుంది. గతంలో ఈ రేటు 5.50 శాతంగా ఉంది. దీనితో పాటు రెండు నుండి మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై వడ్డీని కూడా 0.70 శాతం నుండి 6.25 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్లు ప్రతి కేటగిరీపై 0.50 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాన్ని చౌకగా చేసింది. వినియోగదారులకు వారి రుణంపై రాయితీ ఇవ్వబడుతోంది. హోమ్ లోన్ రేటుపై 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తుంది. అయితే ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్లు మాత్రమే ఈ తగ్గింపు ప్రయోజనం పొందుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణం తగ్గింపు తర్వాత సంవత్సరానికి 8.25% నుండి ప్రారంభమవుతుంది. తగ్గిన హోమ్ లోన్ రేటు నవంబర్ 14, 2022 నుండి వర్తిస్తుంది.
ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ప్రత్యేక హోమ్ లోన్ ఆఫర్. ఇందులో ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్‌లకు మాత్రమే డిస్కౌంట్ ప్రయోజనం ఇవ్వబడుతుంది. కొత్త గృహ రుణాలు తీసుకునే కస్టమర్లకు రేటుపై 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఇవ్వబడుతుంది. అలాగే తమ గృహ రుణాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ చేసే ఖాతాదారులకు కూడా 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఇవ్వబడుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మరో అదనపు సౌకర్యం కింద హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీని మాఫీ చేసింది. ఈ కొత్త సదుపాయంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఒక కస్టమర్ ఎంత హోమ్ లోన్ పొందుతారనేది అతని క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి