Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account KYC: కేవైసీ లేదని బ్యాంక్ అకౌంట్స్ ఆపొద్దు.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

సాధారణంగా ఉద్యోగులు తమ జీతభత్యాలు తమ బ్యాంకు ఖాతాల నుంచి పదే పదే విత్‌డ్రా చేసుకుంటూ, జమ చేస్తుంటారు. దీని ఆధారంగా మాత్రమే వారి ఖాతాలు హై రిస్క్ కేటగిరీలో ఉంచుతారు. ఇదే కారణంతో విద్యార్థుల ఖాతాలు..

Bank Account KYC: కేవైసీ లేదని బ్యాంక్ అకౌంట్స్ ఆపొద్దు.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
RBI
Follow us
Subhash Goud

|

Updated on: Jun 10, 2023 | 7:46 PM

సాధారణంగా ఉద్యోగులు తమ జీతభత్యాలు తమ బ్యాంకు ఖాతాల నుంచి పదే పదే విత్‌డ్రా చేసుకుంటూ, జమ చేస్తుంటారు. దీని ఆధారంగా మాత్రమే వారి ఖాతాలు హై రిస్క్ కేటగిరీలో ఉంచుతారు. ఇదే కారణంతో విద్యార్థుల ఖాతాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కమిటీ అది తప్పుగా పరిగణించింది. దీనితో పాటు, అటువంటి కస్టమర్ల ఖాతాలను తక్కువ రిస్క్ కేటగిరీలో ఉంచాలని సిఫార్సు చేసింది. బ్యాంక్ అధిక రిస్క్ ఖాతాల కేవైసీని రెగ్యులర్ వ్యవధిలో నిర్వహిస్తుంది.

కస్టమర్ సకాలంలో పేరు, చిరునామా రుజువుతో బ్యాంకుకు చేరుకోకపోతే, అకౌంట్‌ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. ఇది వారిని ఇబ్బందిగా మారుతోంది. అందుకే కేవైసీని పదే పదే అడగకూడదని కమిటీ చెప్పింది. అకౌంట్‌ హోల్డర్స్ ఒకవేళ కేవైసీ ఇవ్వకపోతే వారి అకౌంట్స్‌ నిలిపివేయడం కుదరదని కమిటీ సూచించింది.

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ బిపి కనుంగో అధ్యక్షతన కస్టమర్ సర్వీస్ ప్రమాణాలను సమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐలు) అయినప్పటికీ, జీతం పొందే వ్యక్తుల ఖాతాలను అధిక రిస్క్‌లో ఉంచడం గమనించిన కమిటీ ఇది సరికాదని స్పష్టం చేసింది. దీంతోపాటు ప్రభుత్వానికి కమిటీ పలు సిఫార్సులు చేసింది.

ఇవి కూడా చదవండి

అన్ని బ్యాంకులకు వారి స్వంత అంబుడ్స్‌మన్ ఉంటారు. కస్టమర్ల ఫిర్యాదులను ముందుగా అంతర్గత అంబుడ్స్‌మన్ పరిష్కరిస్తారు. వారు ఎక్కువగా బ్యాంకుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ జీతం కోసం ఆర్బీఐ ఒక నిధిని సృష్టించాలి అని కమిటీ చెప్పింది. బ్యాంకు నుంచి జీతం తీసుకుంటున్నందున తమను తాము బ్యాంకు ఉద్యోగులుగా భావిస్తారు. ఇలా ఆర్బీఐ నిధి నుంచి జీతం ఇస్తే ఆ పరిస్థితి ఉండదని కమిటీ సూచించింది.

బ్యాంకులకు వ్యతిరేకంగా వచ్చే చాలా ఫిర్యాదులు ఖాతాల నిర్వహణకు సంబంధించినవి. ఖాతాదారుడు మరణించిన తరువాత, బంధువులు క్లెయిమ్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి వారిని బయట పడేయడం కోసం అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తేదీ నుంచి 30 రోజులలోపు క్లెయిమ్‌ను పరిష్కరించాలని కమిటీ సలహా ఇచ్చింది.

కమీషన్ అలాగే బాధ్యతల కారణంగా, బ్యాంక్ ఉద్యోగులు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్‌లతో సహా ఇతర ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ను కస్టమర్‌లకు అందిస్తారు. ఈ ప్రొడక్ట్స్ ఎలా సేల్ అవుతున్నాయో బ్యాంకులతో చెక్ చేసుకోవాలి. కస్టమర్లను ఒత్తిడి చేయడం ద్వారా ఈ ప్రొడక్ట్స్ సేల్ చేశారా అనే విషయాన్ని ఇంటర్నల్ ఆడిట్ ద్వారా తెలుసుకోవాలి. ఇటువంటి వాటికి ఆయా బ్యాంకులు నివారణ చర్యలు చేపట్టాలని ఆర్బీఐ కమిటీ సూచించింది.

ఇవే కాకుండా బ్యాంకులో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ఖాతాదారుడికి నష్టం వాటిల్లితే బ్యాంకుదే బాధ్యత. చికిత్స, నష్టాల కోసం తగిన బ్యాంకు బీమా పొందండి. ATMలలో టాక్స్-టు-స్పీచ్ సాఫ్ట్‌వేర్, చాట్‌బాట్‌లను ఇన్‌స్టాల్ చేయండి. లావాదేవీ విఫలమైతే, కారణాన్ని వివరించడానికి స్క్రీన్‌పై సరైన మెసేజ్ డిస్ప్లే చేయాలి వంటి పలు సూచనలు కూడా ఆర్బీఐ కమిటీ చేసింది. వీటన్నిటినీ పాటిస్తే బ్యాంకింగ్ సర్వీసులు కస్టమర్లకు మరింత చేరువ అవుతాయని కమిటీ పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి