FD for Senior Citizen: ఆ బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్..  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ పెంపు.. వివరాలు ఇవి..

చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్  డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ప్రధానంగా ఆర్బీఐ అధికంగా వడ్డీ రేటును పెంచింది. మిగిలిన బ్యాంకుల్లో వడ్డీ రేట్ల వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

FD for Senior Citizen: ఆ బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్..  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీగా వడ్డీ పెంపు.. వివరాలు ఇవి..
Fixed Deposit
Follow us
Madhu

|

Updated on: Jun 10, 2023 | 7:23 PM

ఫిక్స్ డ్ డిపాజిట్లంటే ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఖాతాదారుల పట్టుబడికి స్థిరమైన రాబడిని అందిస్తాయి. వడ్డీ రేట్లు కూడా కాస్త అధికంగానే ఉంటాయి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీంతో అందరూ వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక సీనియర్ సిటిజెన్స్ కు అయితే మరిన్ని అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఎఫ్ డీలను సాధారణంగా బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఒక్కో దగ్గర ఒక్కో రకమైన వడ్డీ రేటు ఉంటుంది.  ఎస్బీఐ, హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద కమర్షియల్ బ్యాంకులు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లపై మంచి ఆకర్షణీయ వడ్డీనే అందిస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో సాధారణ పౌరులకు 3శాతం నుంచి 7.25శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుండగా.. సీనియర్ సిటిజెనులకు 3.5శాతం నుంచి 7.75 వరకూ ఉంటోంది. జూన్ ఎనిమిదో తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5శాతానికి తీసుకొచ్చింది. దీని కారణంగా ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ప్రభావితం అవుతున్నాయి. ఆ తేడాలు ఎలా ఉన్నాయంటే..

పెరిగిన వడ్డీ రేట్లు..

చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్  డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ప్రధానంగా ఆర్బీఐ అధికంగా వడ్డీ రేటును పెంచింది. మిగిలిన బ్యాంకుల్లో వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

ఇవి కూడా చదవండి
  • ఆర్బీఎల్ బ్యాంకు.. ఈ బ్యాంకులో ఎఫ్ డీ ఖతాలపై సాధారణ ప్రజలకు 3.50 శాతం నుంచి 7.80శాతం కాగా సీనియర్ సిటిజెన్స్ కి మాత్రం 4 నుంచి 8.30 వరకూ ఉంటుంది.
  • ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. ఈ బ్యాంకులో తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3. 50శాతం నుంచి 7.75 శాతం వరకూ, అదే సీనియర్ సిటిజెన్స్ కి అయితే 4.50 నుంచి 8.00శాతం వరకూ వడ్డీ రేటును అందిస్తోంది.
  • కేవీబీ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఎఫ్ డీ ఖతాలపై సాధారణ ప్రజలకు 4.00% – 7.50%, సీనియర్ సిటిజెన్స్ 4.50% – 8.00% వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • కెనరా బ్యాంక్.. ఈ బ్యాంకులో తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.00% – 7.25%, సీనియర్ సిటిజెన్స్ కు 4.00% – 7.75% వరకూ వడ్డీ రేటు వస్తుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్.. దీనిలో ఎఫ్ డీలపై సాధారణ పౌరులకు 3.50% – 7.25%, సీనియర్ సిటిజెన్స్ కు 4.00% – 7.75% వడ్డీరేటు అందిస్తోంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఈ బ్యాంకులో తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.00% – 7.25%, సీనియర్ సిటిజెన్స్ కు 3.50% – 7.75% వడ్డీ వస్తుంది.
  • యాక్సిస్ బ్యాంక్.. దీనిలో ఎఫ్ డీలపై సాధారణ పౌరులకు 3.50% – 7.10%, సీనియర్ సిటిజెన్స్ కు 3.50% – 7.85% వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • హచ్డీ ఎఫ్సీ బ్యాంక్.. దీనిలో ఎఫ్ డీలపై సాధారణ పౌరులకు 3.00% – 7.25%, సీనియర్ సిటిజెన్స్ కు 3.50% – 7.75% వడ్డీ రేటు ఉంటుంది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకులో తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.00% – 7.10%, సీనియర్ సిటిజెన్స్ కు 3.50% – 7.60% వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్.. దీనిలో ఎఫ్ డీలపై సాధారణ పౌరులకు 3.00% – 7.10%, సీనియర్ సిటిజెన్స్ 3.50% – 7.60% వడ్డీ రేటు ఉంటుంది.
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకులో తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.50% – 6.75%, సీనియర్ సిటిజెన్స్ 4.00% – 7.25% వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • ఇండియన్ బ్యాంక్.. దీనిలో ఎఫ్ డీలపై సాధారణ పౌరులకు 2.80% – 6.70%, సీనియర్ సిటిజెన్స్ 3.30% – 7.20% వరకూ వడ్డీ రేటు వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..