Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okinawa Praise vs Ather 450x: తక్కువ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే రెండు ఈవీల్లో ఇన్ని వ్యత్యాసాలా? అవేంటో తెలిస్తే షాకవుతారు

మార్కెట్‌లో ఎన్ని మోడ్సల్ ఈవీలు వచ్చినా రెండు ఈవీలు మాత్రం ధరతో పాటు ఫీచర్ల విషయంలో పోటీపడతున్నాయి. సేల్స్ పరంగా చూసినా ఈ రెండు ఈవీ స్కూటర్లు మెరుగైన సేల్స్‌తో తమ మార్క్‌ను చూపిస్తునన్నాయి. ఒకినావా ప్రైజ్‌తో మాటు ఏథర్ 450 ఎక్స్ స్టైలిష్ లుక్‌తో పాటు కీలకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Okinawa Praise vs Ather 450x: తక్కువ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే రెండు ఈవీల్లో ఇన్ని వ్యత్యాసాలా? అవేంటో తెలిస్తే షాకవుతారు
Ev Scooters(1)
Follow us
Srinu

|

Updated on: Jun 10, 2023 | 5:30 PM

పెరుగుతున్న కాలుష్యం ప్రపంచానికి సవాల్ విసురుతుంది. ముఖ్యంగా కాలుష్యం పెరగడానికి పరిశ్రమలు ఓ కారణమైతే అంతే స్థాయిలో వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్ఘారాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు ముఖ్యంగా ఈవీ వాహనాల అమ్మకాలను పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ వాహనాలపై వివిధ సబ్సిడీలను అందిస్తూ అమ్మకాలను పెంచుతున్నాయి. దీంతో రైడర్‌లకు పర్యావరణ అనుకూల రైడ్‌ను అందించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. దీంతో ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల రిలీజ్‌లు ఎక్కువగా చూస్తున్నాం. అయితే మార్కెట్‌లో ఎన్ని మోడ్సల్ ఈవీలు వచ్చినా రెండు ఈవీలు మాత్రం ధరతో పాటు ఫీచర్ల విషయంలో పోటీపడతున్నాయి. సేల్స్ పరంగా చూసినా ఈ రెండు ఈవీ స్కూటర్లు మెరుగైన సేల్స్‌తో తమ మార్క్‌ను చూపిస్తునన్నాయి. ఒకినావా ప్రైజ్‌తో మాటు ఏథర్ 450 ఎక్స్ స్టైలిష్ లుక్‌తో పాటు కీలకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే ధర విషయంలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినా వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఏ స్కూటర్‌ కొనుగోలు చేయాలో? నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు స్కూటర్లలో వ్యత్యాసాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఒకినావా ప్రైజ్ 

ఒకినావా ప్రైజ్ ఈవీ స్కూటర్ 1000 వాట్స్ మోటార్ పవర్‌తో గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అంతేకాకుండా ఓసారి చార్జ్ చేస్తే 170 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కటర్ 72 వోల్ట్స్ 26 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో రూపొందించబడింది.  వస్తుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతును ఇస్తుంది. అలాగే చార్జ్ చేయడానికి 4-5 గంటల సమయంలో పడుతుంది. వెనుక, ముందు డిస్క్ బ్రేకులతో పాటు రిమోట్, పుష్ బటన్ ఆన్ సామర్థ్యం కలిగి ఉంది. డిజిటల్ స్పీడో మీటర్‌తో పాటు ట్యూబ్‌లైస్ టైర్లు ఈ స్కూటర్ ప్రత్యేకతగా ఉంది. 

ఎథర్ 450 ఎక్స్

ఎథర్ 450 ఎక్స్ ఈ-స్కూటర్ 165 కిమీ/ఛార్జ్ పరిధిని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్ స్టైలిష్ లుక్స్‌ ఆకట్టుకుంటాయి. గంటకు 90 గరిష్ట వేగంతో ఈ స్కూటర్ దూసుకుపోతుంది. ఈ స్కూటర్ పూర్తిగా చార్జ్ చేయడానికి 5 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. వెనుక డిస్క్ బ్రేకులతో పాటు ముందు డబుల్ డిస్క్ బ్రేకింగ్ సస్టమ్ ఈ స్కూటర్ ప్రత్యేకత. డిజిటల్ స్పీడో మీటర్, పుష్ బటన్ స్టార్ట్, ట్యూబ్ లెస్ టైర్ల వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ స్కూటర్‌లో అందుబాటులో ఉన్నారు. 

ఇవి కూడా చదవండి

ఒకినావా ప్రైజ్, ఎథర్ 450 ఎక్స్ ధరలు ఇలా

ఒకినావా ప్రైజ్ ధర రూ.67,022 నుంచి రూ.99,645 వరకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు, ఏథర్ 450 ఎక్స్ ధర రూ. 1,44,436. అయితే ఆయా రాష్ట్రాల పన్నులను అనుసరించి ఈ స్కూటర్ ధరల్లో వ్యత్యాసం ఉండవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..