Yulu Wynn EV Scooter: రూ.60 వేల విలువైన ఈవీ స్కూటర్ రూ.1750కే.. ఎలా కొనుగోలు చేయాలో? తెలుసుకోండిలా..!

ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విస్తరించినప్పటి నుంచి ప్రతి సంస్థ ఈ విభాగంలో అధిక-డ్రైవింగ్ రేంజ్ స్కూటర్లను అందుబాటులో ఉన్న ధరకు రిలీజ్ చేస్తున్నాయి. యులు వైన్ అనే కంపెనీ తాజాగా వినియోగదారుల అవసరాలన్నింటినీ తీర్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవలే పరిచయం చేసింది. ఈ స్కూటర్ యులు యాప్‌లో రూ.999కి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

Yulu Wynn EV Scooter: రూ.60 వేల విలువైన ఈవీ స్కూటర్ రూ.1750కే.. ఎలా కొనుగోలు చేయాలో? తెలుసుకోండిలా..!
Yulu
Follow us

|

Updated on: Jun 03, 2023 | 6:15 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అమెరికా, చైనా తర్వాత భారతదేశంలో అత్యధిక స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఈవీ వాహనాల్లో ముఖ్యంగా స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విస్తరించినప్పటి నుంచి ప్రతి సంస్థ ఈ విభాగంలో అధిక-డ్రైవింగ్ రేంజ్ స్కూటర్లను అందుబాటులో ఉన్న ధరకు రిలీజ్ చేస్తున్నాయి. యులు వైన్ అనే కంపెనీ తాజాగా వినియోగదారుల అవసరాలన్నింటినీ తీర్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవలే పరిచయం చేసింది. ఈ స్కూటర్ యులు యాప్‌లో రూ.999కి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. భారతదేశంలో 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు గేర్‌లెస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను నడపవచ్చు. వారి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదని నిబంధనలు చెబుతున్నాయి. కాబటి 250 వాట్స్ పవర్ మోటార్‌తో కూడిన స్కూటర్‌ రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ విలువ రూ.60 వేలు ఉండగా కేవలం రూ.1750కే మన ఇంటికి తీసుకెళ్లవచ్చు.. అది ఎలాగో ఓ సారి తెలుసుకుందాం.

ఈ స్కూటర్ అధిక సామర్థ్యం ఉన్న 51 వీ/19.3 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 24.9 కి.మీటర్లు ఇది వాంఛనీయ పనితీరు కోసం బలమైన 250 వాట్స్, బీఎల్‌డీసీ మోటార్‌ను కలిగి ఉంది. అలాగే అధిక భద్రత కోసం ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బ్రేక్‌లు రెండు చక్రాలను స్వతంత్రంగా నియంత్రించి, ప్రమాదాలను నివారించగలవు. ముఖ్యంగా ఆహ్లాదకరమైన రైడ్ కోసం ఇది అభివృద్ధి చేశారు. సీట్ కాంటౌర్ యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు. యులు వైన్ ఈ-స్కూటర్ కంప్యూటరైజ్డ్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఇది దాని రూపాన్ని పెంచుతుంది. దీని డిజైన్ వీలైనంత చిన్నదిగా ఉంటుంది. ఫలితంగా రహదారిపై నియంత్రించడం చాలా సులభంగా ఉంటుంది. ఈ  ఎలక్ట్రిక్ స్కూటర్ 12 అంగుళాల పెద్ద చక్రాలను కలిగి ఉంది. ఇది స్టైలిష్ రూపాన్ని ఇస్తుంది. ఈ స్కూటర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈవీలో ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు,వెనుక షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఉన్నాయి. ఫలితంగా, రైడర్ కఠినమైన రోడ్లపై తక్కువ కుదుపులను అనుభవిస్తాడు. ఈ స్కూటర్ హీరో ఎలక్ట్రిక్ ఎడ్డీ, ఒకినావా ఆర్ 30, జాయ్ ఈ-బైక్‌లతో మార్కెట్‌లో గట్టి పోటీనిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అదిరిపోయే ఆఫర్ ఇదే

ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 55,555 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఈ స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లడానికి రూ.6000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. అలాగే మూడు సంవత్సరాల పాటు  ఫైనాన్సింగ్ కోసం 9.7 శాతం వడ్డీ రేటుతో వస్తుంది. అంటే నెలవారీ రూ.1,750 తక్కువ ప్రీమియంతో ఈ స్కూటర్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే డౌన్ పేమెంట్‌ను మార్చడం ద్వారా నెలవారీ వాయిదాను మార్చవచ్చు.  

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..