Best Car Under 6 Lakhs: 7 సీటర్ కార్.. అదిరిపోయే ఫీచర్స్.. ధర రూ. 5.27 లక్షలతో మొదలు.. వివరాలివే..
Auto News: మారుతి సుజుకి బాలెనో మే నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో, వ్యాగన్ఆర్ మూడవ స్థానంలో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలతో పాటు.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో 7 సీటర్ కార్స్ కూడా ఉన్నాయి. వీటిలో మారుతి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడవుతోంది.
Auto News: మారుతి సుజుకి బాలెనో మే నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో, వ్యాగన్ఆర్ మూడవ స్థానంలో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలతో పాటు.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో 7 సీటర్ కార్స్ కూడా ఉన్నాయి. వీటిలో మారుతి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడవుతోంది. మే నెలలో, చౌకైన 7 సీటర్ కారు ఒకటి ఎర్టిగాను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ కారు ఖరీదు కూడా రూ.5.5 లక్షల లోపే ఉండటం విశేషం. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కార్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మారుతి ఈకో..
మారుతి సుజుకి ఈకో మే నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ కారుగా నిలిచింది. గత నెలలో 12,800 యూనిట్లను విక్రయించింది. ఇది మొత్తం కార్ల విక్రయాలలో 7వ స్థానంలో ఉంది. రెండవ అత్యధికంగా అమ్ముడైన 7 సీట్ల కారు మారుతి ఎర్టిగా. మే నెలలో 10,500 యూనిట్లను విక్రయించింది. మారుతి ఈకో ధర రూ.5.27 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది 6, 7 సీటర్స్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
మారుతి ఈకో ఇంజన్, మైలేజ్..
మారుతి సుజుకి ఈకో 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో 80.76 PS పవర్, 104.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త పవర్‌ట్రెయిన్ మునుపటి మోడల్ కంటే 10% ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. CNGతో, ఇంజిన్ 71.65 PS శక్తిని, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది.
టూర్ వేరియంట్ పెట్రోల్, CNG రెండింటిలోనూ 20.20kmpl (ARAI సర్టిఫైడ్), 27.05km/kg మైలేజీని అందిస్తుంది. ప్యాసింజర్ వేరియంట్ పెట్రోల్, CNG రెండింటిలోనూ 19.71kmpl, 26.78km/kg చొప్పున మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ.5.21 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మే 2023లో అత్యధికంగా అమ్ముడయిన 10 కార్లు..
మారుతి సుజుకి బాలెనో – 18,700 యూనిట్లు
మారుతీ సుజుకి స్విఫ్ట్ – 17,300 యూనిట్లు
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 16,300 యూనిట్లు
హ్యుందాయ్ క్రెటా – 14,449 యూనిట్లు
టాటా నెక్సాన్ – 14,423 యూనిట్లు
మారుతీ సుజుకీ బ్రెజ్జా – 13,398 యూనిట్లు
సుజుకి ఈకో – 12,800 యూనిట్లు
మారుతి సుజుకి డిజైర్ – 11,300 యూనిట్లు
టాటా పంచ్ – 11,100 యూనిట్లు
మారుతి సుజుకి ఎర్టిగా – 10,500 యూనిట్లు
మరిన్ని ఆటోమొబైల్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..