Kinetic E-Luna: బజాజ్ చేతక్ ఈవీకి పోటీగా మార్కెట్‌లోకి లూనా ఈవీ వెర్షన్.. స్పెసిఫికేషన్లు తెలిస్తే షాకవుతారంతే

భారతదేశంలో టూ వీలర్ రంగం విస్తరించే సమయంలో కెనటిక్ కంపెనీకి చెందిన లూనా ఎక్కువ ఆదరణ పొందింది. లూనా బండిని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈవీ వాహనాలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో భారతీయులు అత్యధికంగా ఆదరించిన లూనా స్కూటర్‌ను ఈవీ వెర్షన్‌‌లో రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ కెనటిక్ లూనా ఈవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Kinetic E-Luna: బజాజ్ చేతక్ ఈవీకి పోటీగా మార్కెట్‌లోకి లూనా ఈవీ వెర్షన్..  స్పెసిఫికేషన్లు తెలిస్తే షాకవుతారంతే
Luna
Follow us

|

Updated on: Jun 08, 2023 | 5:30 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈవీలు మారడంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్నీ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. భారతదేశంలో టూ వీలర్ రంగం విస్తరించే సమయంలో కెనటిక్ కంపెనీకి చెందిన లూనా ఎక్కువ ఆదరణ పొందింది. లూనా బండిని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈవీ వాహనాలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో భారతీయులు అత్యధికంగా ఆదరించిన లూనా స్కూటర్‌ను ఈవీ వెర్షన్‌‌లో రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ కెనటిక్ లూనా ఈవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రాబోయే కైనెటిక్ ఈ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ డిజైన్, పవర్‌ట్రెయిన్ వివరాలు లాంచ్‌కు ముందే లీకయ్యాయి. కైనెటిక్ ఈ లూనా చాలావరకు అసలు పెట్రోల్‌తో నడిచే కైనెటిక్ లూనాను పోలి ఉంటుందని చిత్రాలు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ స్కూటర్ గురించి ఇతర వివరాలపై ఓ లుక్కేద్దాం.

రాబోయే ఎలక్ట్రిక్ మోపెడ్ ఫ్లాట్ స్టోరేజీ బే వంటి ప్రాక్టికల్ డిజైన్ బిట్‌లను కలిగి ఉంటుంది. వేగవంతమైన ఛార్జ్ టర్న్‌అరౌండ్ సమయాల కోసం స్వాప్ చేసే బ్యాటరీలతో వస్తుందని అంచనా. అయితే కైనెటిక్ ఈ లూనాను చూడగానే ఓల్డ్ లూనా గుర్తుకు వచ్చేలా డిజైన్ చేశారు. ట్యూబులర్ బేస్, స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్, గ్రాబ్ రైల్‌తో కూడిన ఫ్లాట్ సీట్లు, పెడల్ కూడా ఉన్నట్లు లీక్డ్ ఫొటోలు సూచిస్తున్నాయి. ఫ్లాట్ ఫ్రంట్ స్టోరేజ్ బే  ఈస్కూటర్‌కు ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డిజైన్ మధ్యతరగతి ప్రజలతో పాటు డెలివరీ ఏజెంట్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 

కెనటిక్ లూనా ప్రత్యేకతలు ఇవే

కెనెటిక్ ఇ లూనాకు 16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, మోపెడ్ ఆపడానికి రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ లూనా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఈ లూనా ఒక ‘హై-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్‌తె ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పవర్‌ట్రెయిన్ డిజైన్ ఛార్జ్ టర్న్‌అరౌండ్ టైమ్‌లను తగ్గించడానికి మార్చుకోగల లేదా తొలగించగల బ్యాటరీ ప్యాక్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. కైనెటిక్ ఈ లూనా హబ్ మోటారును ఉపయోగిస్తుందా? లేదా బెల్ట్-ఆధారిత సెటప్‌ను ఉపయోగిస్తుందా అనే విషయం మాత్రం  ప్రస్తుతం తెలియదు. అయితే ప్రధానంగా ఈ స్కూటర్ బజాజ్ కంపెనీకు చెంది యులు వైన్, యులు మిరాకిల్ జీఆర్, యులు డెక్స్ జీఆర్ వంటి స్కూటర్లకు గట్టి పోటీగా నిలుస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..